Breaking News

విస్తుగొలిపే ఘటన: పార్శిల్‌లో మృతదేహం

Published on Fri, 12/20/2024 - 15:56

ఉండి:  పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్‌బాడీ పార్శిల్‌గా రావడం తీవ్ర కలకలం రేపింది. ఓ మహిళకు వచ్చిన పార్శిల్‌ను తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించింది. దీంతో గుండె జారినంత పనైన సదరు మహిళ..  ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో పాటు పోలీసులకు సమాచారం అందించింది.

ఉండి మండలం యండగండికి చెందిన తులసి సాగి అనే మహిళకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. అయితే ఆ ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయంలో భాగంగా రాజమండ్రి(రాజమహేంద్రవరం) క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువుల్ని పార్శిల్‌ ద్వారి ఆ సంస్థ పంపిస్తోంది. దీనిలో భాగంగా తొలి విడతో టైల్స్‌ పంపించగా, రెండో విడతలో విద్యుత్‌ సామాగ్రి పంపిస్తున్నామని చెప్పారు. అయితే ఇక్కడే ట్విస్ట్‌ చోటు చేసుకుంది. రెండో విడతలో రావాల్సిన విద్యుత్‌ సామాగ్రి స్థానంలో ఒక మృతదేహం పార్శిల్‌గా వచ్చింది.

ఒక ఆటో డ్రైవర్‌ తీసుకొచ్చిన ఆ పార్శిల్‌ను ఓపెన్‌ చేసి చూడగా అందులో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది.  దాంతో పాటు కోటి రూపాయలకు పైగా తమకు చెల్లించాలనే లెటర్‌ కూడా ఆ పార్శిల్‌లో ఉంది. దీనిపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పార్శిల్‌ ప్యాకింగ్‌ దగ్గర్నుంచి పార్శిల్‌ తీసుకొచ్చిన వ్యక్తి వరకూ అందర్నీ పిలిచి ఆరా తీస్తున్నారు. 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)