Breaking News

ప్రేమ.. పెళ్లి.. వేధింపులు.. ఆత్మహత్య

Published on Wed, 11/20/2024 - 07:38

ధారూరు: ఓ అనాథ బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడంతో పాటు వేధింపులకు గురిచేసి, ఆత్మహత్యకు ప్రేరేపించిన యువకుడు, అతని కుటుంబ సభ్యులపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్, గ్రామస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.. ధారూరు మండల కేంద్రానికి చెందిన కె.మంజుల, యాదయ్య దంపతులకు కొడుకు, కూతురు సంతానం. మంజుల, యాదయ్య కొన్నేళ్ల క్రితం మరణించారు. 

మూడేళ్ల క్రితం వీరి కొడుకు కూడా మృతిచెందడంతో కూతురు స్వాతి(16) అనాథగా మిగిలింది. దోర్నాల్‌ గ్రామంలో ఉంటున్న అమ్మమ్మ బాలికను చేరదీసి, స్థానిక కస్తూర్బా విద్యాలయంలో చేరి్పంచింది. ఇదే సమయంలో కుక్కింద గ్రామానికి చెందిన యువకుడు శ్రీకాంత్‌ తా ను స్వాతిని ప్రేమిస్తున్నానంటూ తీసుకెళ్లి, పెళ్లి చేసుకున్నాడు. ఏడాది పాటు వీరి కాపురం సజావు గానే సాగింది. ఆ తర్వాత భర్త శ్రీకాంత్‌తో పాటు అత్త, మామలు వెంకటమ్మ, యాదయ్య, ఆడపడుచులు స్వాతిని వేధించడం ప్రారంభించారు.

వీరి ఆగడాలు భరించలేక ఈనెల 16న సాయంత్రం స్వాతి ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి, స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. స్వాతి ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్త, మామ, ఆడపడుచులపై బాల్య వివాహం, వేధింపులు, పోక్సో, ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్ల కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.  

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)