Breaking News

పని మనిషి ఆత్మహత్య.. పదేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం

Published on Mon, 08/14/2023 - 11:45

హైదరాబాద్: ల్యాంకోహిల్స్‌లో 21వ అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి కృష్ణ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదుచేశారు. యువతి బలవన్మరణానికి వేధింపులే కారణమని నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో వ్యాపారి, కన్నడ నటుడు అయిన ఓ వ్యక్తి సాగిస్తున్న చీకటి కార్యకలాపాలు, దారుణాలు బయటపడుతున్నాయి. స్థానికులు, పోలీసుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం..

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణచంద్‌రావు కొన్ని కన్నడ సినిమాల్లో నటించాడు. పదేళ్ల క్రితం నగరానికి చేరి బంజారాహిల్స్‌ కేంద్రంగా హోం థియేటర్ల వ్యాపారం చేస్తున్నాడు. మణికొండ ల్యాంకోహిల్స్‌ అపార్ట్‌మెంట్స్‌ 15 ఎల్‌హెచ్‌ బ్లాక్‌లో భార్య, కుమార్తెతో ఉంటున్నాడు. కుమార్తె కేర్‌టేకర్‌గా పదేళ్లుగా కాకినాడకు చెందిన బిందుశ్రీ పనిచేస్తోంది. అక్కడే తనకు కేటాయించిన గదిలో ఉంటోంది. పదేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం . కొద్దిరోజులుగా వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.

ఐదురోజుల క్రితం పూర్ణచంద్‌రావు కుమార్తెను సాకేందుకు మరో యువతిని ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో శుక్రవారం రాత్రి గొడవలు తారాస్థాయికి చేరాయి. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ పరస్పరం వాదించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. ఆ తరువాత బిందుశ్రీపై 21వఅంతస్తుపై నుంచి కిందకు దూకింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది రాయదుర్గం పోలీసులకు సమాచారమిచ్చారు. పనిమనిషి ఆత్మహత్య విషయం పూర్ణచంద్‌రావుకు తెలియజేసేందుకు అతడి ఫ్లాట్‌కు చేరగా.. అరగంట తర్వాత తలుపులు తీయటంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు.

వేధింపుల వల్లేనా?
కన్నడ సినిమాల్లో నటించానంటూ పూర్ణచంద్‌రావు ప్రచారం చేసుకునేవాడు. సినీపరిశ్రమలో తన పరిచయాలతో అవకాశాలు ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు ఆశచూపేవాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. తరచూ ఇదే విధంగా కొంతమంది మహిళలు, యువతులు వచ్చిపోవటం, అనుమానాస్పదంగా తిరగటం గమనించినట్టు అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కొందరు మీడియాకు తెలిపారు. ఘటన జరగడానికి మూడ్రోజుల ముందు నలుగురు యువతులు అతడి ఫ్లాట్‌కు వచ్చారని వివరించారు. అనుమానాస్పద మరణంగా తొలుత భావించిన పోలీసులు వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు నిర్ధారించారు. పూర్ణచంద్‌రావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)