Breaking News

ఐదు నెలల సహజీవనం.. తాళి కట్టే వేళ ప్రియుడు మాయం!

Published on Wed, 10/14/2026 - 07:54

బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనం చేసిన యువకుడు.. తాళి కట్టేందుకు ముఖం చాటేశాడు. న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి  ఆత్మహత్యాయత్నం చేసింది. 

వివరాలు.. హాసన్‌ జిల్లా చన్నరాయపట్న తాలూకా కల్లేసోమహళ్లికి చెందిన సూర్య (26), కేరళలోని కాసరగోడ్‌కు చెందిన నిష్మ (26) బెంగళూరులోని వైట్‌బర్డ్‌ కంపెనీలో పని చేస్తున్నారు. వీరి మధ్య పరిచయం ప్రేమగా మారడంతో ఐదు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. మొదట వీరి పెళ్లికి అంగీకరించిన సూర్య తల్లిదండ్రులు.. ఆ తర్వాత ఒప్పుకోలేదు. మరోవైపు నిష్మ తల్లి కూడా ఈ పెళ్లిని వ్యతిరేకించినట్లు సమాచారం. 

సెప్టెంబర్ 24న సూర్య తన మొబైల్‌ ఫోన్‌ను అక్కడే వదిలి అదృశ్యమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి సూర్య తనను మోసం చేశాడని బాధపడిన నిష్మా.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.  అంతకుముందు  తన చావుకి సూర్య, అతడి తల్లిదండ్రులు, స్నేహితుడు ప్రవీణ్‌ కారణం అంటూ వీడియో పెట్టింది. ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బెంగళూరు మహాలక్ష్మి లేఔట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.  

 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)