Breaking News

మహిళ దారుణ హత్య

Published on Mon, 05/08/2023 - 13:01

వరంగల్: బండరాయితో తలపై మోది మహిళను అతి దారుణంగా హత్య చేసిన ఉదంతం వరంగల్‌ జిల్లా సంగెం మండలంలోని వంజరపల్లిలో ఆదివారం ఉదయం కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లారుగూడ రెవెన్యూ శివారు వంజరపల్లికి చెందిన కౌడగాని శంకర్‌రావు రోజు మాదిరిగా ఉదయం గేదెలను తోలుకుని వ్యవసాయబావి వద్దకు వెళ్తున్నాడు.రోడ్డు పక్కన వెళ్తుండగా దూడ ఒక్కసారిగా బెదిరింది. అటుగా చూడడంతో తప్పెట్ల ఎల్లయ్య వ్యవసాయ భూమి వద్ద మహిళ రక్తపు మడుగులో మృతదేహం కన్పించింది. వెంటనే సర్పంచ్‌ భర్త పెంతల అనీల్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. ఆయన వచ్చి చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై భరత్‌ చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

 సంఘటనా స్థలానికి ఈస్ట్‌ జోన్‌ డీసీపీ కరుణాకర్, మామునూర్‌ ఏసీపీ కృపాకర్, పర్వతగిరి సీఐ శ్రీనివాస్, పోలీస్‌ సిబ్బంది చేరుకున్నారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. మృతదేహం వద్ద లభ్యమైన పర్సులో రూ 5,280 నగుదు, ఐదు రూపాయల కాయిన్, రోడ్డుపై పగిలిన గాజులు, ఒక కాలి చెప్పు, కాలిపట్టాతో పాటుగా మృతురాలి వేలిముద్రలు, రోడ్డుపై పడిన రక్తంను సేకరించారు. మృతదేహం ఎడమపక్కన కనుబొమ్మ, ముక్కు, కణతపై కింది పెదవిపై బండరాయితో మోదినట్లు బలమైన గాయాలున్నాయి. 

శనివారం రాత్రి 9 గంటల తర్వాత ఎవరో మెడకు స్కార్‌్ఫతో ఉరివేసి ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు బండరాయితో మోది చంపి రోడ్డు పక్కన పడవేసినట్లు తెలుస్తుందని పోలీసులు తెలిపారు. మృతురాలు నల్లబెల్లి శివారు జగ్గునాయక్‌ తండాకు చెందిన జర్పుల శౌరి(45)గా బంధువులు గుర్తుపట్టినట్లు తెలిపారు. శౌరి భర్త స్వామి 12 ఏళ్ల క్రితం మరణించాడు. ఇద్దరు కుమారులు సురేష్, వెంకటేష్‌ ఉన్నారు. పెద్ద కుమారుడు సురేష్‌కు భార్య అనూష, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వంజరపల్లి సర్పంచ్‌ భర్త అనీల్‌ ఫిర్యాదు మేరకు పర్వతగిరి సీఐ శ్రీనివాస్‌ కేసునమోదు చేసుకుని హత్యకు కుటుంబకలహాలా లేదా మరే ఇతర కారణాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్‌ తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)