Breaking News

ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

Published on Thu, 05/30/2024 - 06:34

జీడిమెట్ల: అమ్మా.. నాన్న.. మీరు చెప్పిన మాటలు నేను వినలేదు.. ప్రేమిస్తున్నాను అని వెంటపడిన అబ్బాయి ప్రేమను అంగీకరించారు.. అతను పెట్టే మానసిక ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నాను. ఐ లవ్‌ యూ అమ్మా నాన్న అంటూ ఓ యువతి సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ  సంఘటన జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. 

పోలీసుల, మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన మేరకు.. షాపూర్‌నగర్‌ ఎన్‌ఎల్‌బీ నగర్‌కు చెందిన బాలబోయిన కుమార్‌ కుమార్తె అఖిల(22)ను అదే ప్రాంతానికే చెందిన ఓరుగంటి వెంకటేశ్‌ కుమారుడు అఖిల్‌ సాయిగౌడ్‌ గత 8సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడుతున్నాడు. తనను ప్రేమించకపోతే చనిపోతానంటూ వేధించేవాడు. దీంతో అఖిల కూడా సాయిగౌడ్‌ ప్రేమను అంగీకరించి విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు తెలిపింది. ఈ విషయం ఇరుకుటుంబాలు కూర్చుని మాట్లాడుకుని వీరి ప్రేమను అంగీకరించాయి.  



వేధించి రోడ్లపైనే కొట్టేవాడు.. 
కాగా అఖిలను సాయిగౌడ్‌ మానసికంగా వేధించేవాడు. కోపంతో రోడ్లపైనే కొట్టేవాడు. అయినప్పటికీ అఖిల భరిస్తూ వచ్చింది విషయాన్ని పలుమార్లు తల్లిదండ్రులకు కూడా  చెప్పింది. అతని వేధింపులు భరించలేక అఖిల తనలో తానే కుమిలిపోయేది ఇటీవల కొంతకాలం నుండి సాయిగౌడ్‌ పెళ్లి విషయంలో ముఖం చాటేశాడు. దీంతో మరింత కుంగిపోయిన అఖిల మంగళవారం రాత్రి 10 పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఉరి వేసుకుని మృతిచెందింది.  దీంతో జీడిమెట్ల పోలీసులు అఖిల్‌ సాయిగౌడ్‌పై కేసు నమోదు చేశారు.  

 

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)