Breaking News

అమ్మా.. ఎంత పనిచేశావు..!

Published on Thu, 07/18/2024 - 09:12

మేడిపల్లి: ‘అమ్మా.. మమ్మల్ని ముద్దుగా పెంచావు. ఎంత అల్లరి చేసినా ఓపికగా భరించా వు.. అందరితో ఆడుకుంటుంటే మురిసిపోయావు. మేమే నీ లోకం.. మేమే నీ సర్వస్వం అ న్నట్లు మెదిలావు.. అంతలోనే మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోయావా  అమ్మా.. ఇక మాకు దిక్కెవరు.. మమ్మల్ని ఎవరు లా లిస్తారు.. ఎవరు బుజ్జగించి బువ్వ తినిపిస్తారు అ మ్మా.. అనే రీతిలో ఆ చిన్నారులు తల్లి మృతదేహం వద్ద కనిపించిన తీరు కంటతడి పెట్టించింది. క్షణికావేశంలో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం అటు పుట్టింట్లో.. ఇటు మెట్టింట్లో తీరని శోకాన్ని మిగిలి్చంది. 

ఈ విషాధ ఘటన భీమారం మండలంలోని కమ్మరిపేటలో చోటుచేసుకుంది. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన పాక లక్ష్మి, రాజం కూతురు శ్రావణిని కమ్మరిపేట గ్రామానికి చెందిన తిపిరి నరేశ్‌కిచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమారులు శ్రాహన్స్‌(4), రుద్రాన్స్‌ (ఏడాది) ఉన్నారు. నరేశ్‌ తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. శ్రావణి బీడీలు చుడుతోంది. ఉన్నంతలో హాయిగా ఉంటున్నారు. ఈ క్రమంలో శ్రాహన్స్‌కు ఐదు రోజులుగా జ్వరం వస్తోంది. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని నరేశ్‌ శ్రావణికి చెబుతున్నాడు. తానే తీసుకెళ్లాలంటే ఎలా అని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి మంగళవారం ఇంట్లోకి వెళ్లి క్రిమిసంహారక మందు తాగింది. 

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జగిత్యాల ఆస్పత్రికి.. అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘ఎంత పనిచేశావు బిడ్డా.. నీ పిల్లలు పసిమొగ్గలని గుర్తుకురాలేదా.. ఆ యముడే మదిలో నుంచి జ్ఞాపకాలు తీసేసాడా.. అంటూ గుండెలవిసేలా రోదించారు. 

విగతజీవిగా మారిన భార్య మృతదేహాన్ని చూస్తూ భర్త నరేశ్‌.. అమ్మకు ఏమైంది నాన్న అంటూ నాలుగేళ్ల కొడుకు.. ఏం జరుగుతుందో తెలియక బోసిపోయిన ముఖంతో ఏడాది కుమారుడు.. మీ అమ్మ ఇకరాదు బిడ్డా అని ఎలా చెప్పాలో తెలియక బరువెక్కిన హృదయంతో దిక్కులు పిక్కటెల్లేలా రోదించారు శ్రావణి తల్లిదండ్రులు. అప్పటి వరకు అందరితో కలివిడిగా ఉన్న శ్రావణి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తన ఇద్దరు పిల్లలతోపాటు కుటుంబ సభ్యులకు కడుపుకోతను మిగిలి్చంది. పెద్ద కుమారుడితో శ్రావణికి తలకొరివి పెట్టించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంరాజ్‌ తెలిపారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)