Breaking News

పండుగపూట విషాదం.. ప్రేమించి పెళ్లి.. చిన్నచిన్న గొడవలకే

Published on Mon, 09/26/2022 - 13:09

సాక్షి, రామగుండం(కరీంనగర్‌): పండుగపూట ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం పాలకుర్తి మండలం కుక్కలగూడుర్‌ గ్రామంలో విషాదం నింపింది. బసంత్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కందుల శంకరయ్య– కళావతి దంపతుల కూతురు అనూష (24), అదే గ్రామానికి చెందిన మేడం బాపు కుమారుడు మేడం రాకేశ్‌ ప్రేమించుకుని ఎనిమిది నెలల క్రితం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి.

ఈనేపథ్యంలో తన తల్లిగారింట్లో ఉన్న అనూషను శనివారం రాత్రి రాకేశ్‌ వారి ఇంటికి తీసుకెళ్లాడు. రాత్రి సమయంలో ఎప్పుడో పురుగుల మందు తాగిన అనూష ఆదివారం వేకువజామున బాత్రూంకు వెళ్లి కిందపడిపోయింది. నోటివెంట నురుగులు రావడాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ధర్మారంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. బసంత్‌నగర్‌ ఎస్సై మహేందర్‌యాదవ్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: బతుకమ్మ పండగ వేళ విషాదం.. మరొకరితో సహజీవనం చేస్తోందని.. 

గ్రామంలో విషాదం
ఎంగిలిపూల బతుకమ్మ పండుగ రోజున జరిగిన ఈ ఘటనతో కుక్కలగూడుర్‌ గ్రామంలో విషాదం నెలకొంది. మృతురాలు అనూష తండ్రి కందుల శంకరయ్య ఏడాదిక్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. ప్రస్తుతం అనూష ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 

Videos

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

సారీ బాబు గారు.. ఇక్కడ బిల్డింగులు కట్టలేం

Photos

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)