Breaking News

టిప్పర్‌ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం..!

Published on Wed, 03/11/2026 - 12:17

కర్ణాటక: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించిందో భార్య. ఆమెతో  పాటు నలుగురు నిందితులను శ్రీరంగపట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. తాలూకాలోని మారళగాల గ్రామ అర్చకుడు సిద్ధలింగప్ప తన అక్క కుమార్తె షాలినిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాలినికి అదే ఊరికి చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ హరీశ్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఒకరోజు షాలిని, హరీశ్‌ ఏకాంతంగా ఉన్నప్పుడు భర్తకు దొరికిపోయారు. ఇలాంటి పనులు చేయరాదని భార్యను మందలించడంతో ఆమె కక్ష పెంచుకుంది.  తన భర్తను చంపేయమని హరీశ్‌కు సిఫార్సు చేసింది. 

మార్చి 6న రాత్రి అర్చకుడు సిద్ధలింగప్ప.. కె.శెట్టిహళ్లి గణపతి దేవస్థానంలో పూజ ముగించుకుని  ఇంటికి పయనమయ్యాడు.   హరీశ్, మరో టిప్పర్‌ డ్రైవర్‌ సంతోష్‌ కుమార్‌తో కలసి గ్రామం వద్ద ఉన్న కాలువ ఏరియా నిర్మానుష్య ప్రాంతంలో అర్చకుడిని అడ్డగించారు. కట్టెలతో బాది చంపేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అక్కడక్కడ అతని వస్తువులు వేసి, బైక్‌ను కాలువలోకి పడేశారు.  7న సీడీఎస్‌ కాలువలో సిద్ధలింగప్ప మృతదేహం లభించింది. ముఖానికి, తలకు గాయాలున్నాయి. ఎవరో  వ్యక్తులు దాడి చేసి చంపి ఉంటారని భావించి అతడి అన్న బాలసుందర్‌ శ్రీరంగపట్టణ గ్రామీణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ శోభారాణి ప్రత్యేక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆధారాలను బట్టి మార్చి 9న హరీశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. సిద్ధలింగప్ప భార్య షాలిని, సంతోష్‌ కుమార్, గణేశ్‌తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నట్లు అంగీకరించాడు. షాలిని , హరీశ్, సంతోష్‌ కుమార్, గణేశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)