Breaking News

ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు భర్తను కడతేర్చింది

Published on Tue, 03/11/2025 - 08:15

అన్నానగర్‌: తన మరో ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చిందో మహిళ. వివరాలు.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన జనార్థన (22). అదే ప్రాంతానికి చెందిన ఎలన్‌ మేరీ(21) కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రేమించుకున్నారు. పెద్దలను కాదని వీరిద్దరూ నాగై జిల్లాలోని వేలంగన్నికి వచ్చి మాతా గుడిలో పెళ్లి చేసుకుని లాడ్జిలో ఉంటున్నారు. అయితే ఆదివారం జనార్థన వేలంగన్ని రైల్వే స్టేషన్‌ సమీపంలో శవమై వెలుగులోకి రావడం కలకలం రేపింది. 

అయితే  జనార్థన, మేరీతో కలిసి ఉంటున్న ఇద్దరు వ్యక్తులు రైలులో తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని పట్టుకుని విచారణ చేశారు. వారు బెంగళూరు శివమొగ్గ ప్రాంతానికి చెందిన సుబ్రమణ్య కుమారుడు జీవన్‌ (19), 15 ఏళ్ల బాలుడు అని తేలింది. జనార్థనను పక్కా ప్లాన్‌ చేసి కడతేర్చారని తేలింది. ఎలన్‌మేరీ ఓ వైపు జనార్థన ప్రేమిస్తూనే, మరోవైపు జీవన్‌తో కూడా ప్రేమాయణం వెలగబెడుతున్నట్టు వెల్లడైంది. 

తమకు అడ్డుగా ఉన్న జనార్థనను కడతేర్చాలని ఎలన్‌ మేరి, జీవన్‌ వ్యూహం పన్నారు. దీని ప్రకారం వేలంగన్నిలో జనార్థనను వివాహం చేసుకున్న ఎలన్‌ మేరి, తన ప్రియుడు జీవన్‌తో కలిసి అతడిని హత్య చేసింది. వాస్తవానికి ఆమెకు రెండేళ్ల క్రితమే ధర్మపురిలో వివాహమైంది. ఆ తర్వాత జనార్థనను ప్రేమించి రెండో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత జీవన్‌ను పెళ్లిచేసుకునేందుకు హత్యకు స్కెచ్‌ వేసింది. ఈ హత్యకు సంబంధించి ఎలన్‌ మేరి, జీవన్‌తోపాటు 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు.

 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)