Breaking News

కుటుంబంలో స్పర్ధలతోనే అలీఖాన్‌ ఆత్మహత్య? 

Published on Wed, 03/01/2023 - 02:03

హైదరాబాద్‌: ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ వియ్యంకుడు మజారుద్దీన్‌ అలీఖాన్‌(60) ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో తన నివాసంలో రివాల్వర్‌తో కాల్చుకొని ఆయన మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులతో పాటు ఆ ఇంట్లో పని చేస్తున్న సిబ్బందిని విచారిస్తున్నారు. మజారుద్దీన్‌కు రెండు లైసెన్స్‌డ్‌ తుపాకులు ఉండగా వీటిని గత డిసెంబర్‌లో బంజారాహిల్స్‌లోని గన్‌ అఫైర్స్‌లో డిపాజిట్‌ చేశారు. అయితే ఇందులో ఒక పిస్టల్‌ను తిరిగి వారం క్రితమే రిలీజ్‌ చేసుకొని ఇంటికి తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. 

భార్యతో ఇంటి వివాదం..: ప్రస్తుతం ఉన్న ఇల్లు ఆయన భార్య అఫియా రషీద్‌ అలీఖాన్‌ పేరు మీద ఉండగా ఈ ఇంట్లో తాను మాత్రమే ఉంటానని భర్తతో పాటు కొడుకు, కోడలును బయటికి పంపించాలంటూ ఆమె సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. నెలన్నర క్రితం తీర్పు కాపీతో బంజారాహిల్స్‌ పోలీసుల బందోబస్తు మధ్య ఆమె ఇంట్లోకి వెళ్ళారు. కానీ ఇంట్లో ఉన్న వాళ్లెవరూ బయటకు వెళ్లలేదు. ఇక ఇంట్లోకి వెళ్ళిన ఒకటి, రెండు రోజులకే గొడవలు తీవ్రమై ఆమె కత్తితో చెయ్యి కూడా కోసుకున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ ఇంటి వివాదంతో పాటు భార్యా భర్తల మధ్య తరచూ మనస్ఫర్థలు వచ్చేవని, కుమారుడు పూర్తిగా తండ్రికి మద్దతుగా ఉండే వాడని చెబుతున్నారు. 

ఒక రౌండ్‌ కాల్పులు...  
మజారుద్దీన్‌ తన పిస్టల్‌తో ఒక రౌండ్‌ కాల్పులు జరుపుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. బుల్లెట్‌ కుడివైపు కణతి నుంచి ఎడమ వైపు మీదుగా బయటపడి ఆ గదిలోనే క్లూస్‌ టీమ్‌కు లభించింది. పోలీసుల దర్యాప్తునకు కుటుంబ సభ్యులు అంతగా సహకరించడం లేదని తెలుస్తోంది. మృతుడి సోదరుడు జహీరుద్దీన్‌ అలీఖాన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)