Breaking News

పండగ పూట విషాదం.. ఆడుకుంటూ వెళ్లి బకెట్‌లో పడటంతో

Published on Sun, 01/15/2023 - 14:43

సాక్షి, వికారాబాద్‌: వికారాబాద్‌లో పండుగ పూట విషాదం నెలకొంది. అంబాడుతూ వెళ్లిన ఏడాది బాలుడు బకెట్లో  పడి మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నా యి.. అనంతగిరి పట్టణంలోని పాత శిశు మందిరం సమీపంలో నివాసముండే దశరథ్, భాగ్యలక్ష్మికి ఇద్దరు సంతానం. వీరిలో చిన్నవాడు విఖ్యాత్‌ (1). పండుగ సందర్భంగా శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఎవరి పనుల్లో వారుండగా.. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి బాత్‌రూంలోని బకెట్‌లో ఇరుక్కున్నాడు.

తలకిందులుగా పడటంతో బకెట్‌లోనే ప్రాణాలు వదిలాడు. అరగంట తర్వాత బాబు కోసం చూడగా ఉలుకుపలుకు లేకుండా బకెట్లో పడి కనిపించాడు. దీంతో తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లోని ఓ షోరూంలో సెల్‌ ఫోన్‌ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు.

రోజూ మాదిరిగానే డ్యూటీకి వెళ్తూ వికారాబాద్‌ స్టేషన్‌లో రైలు ఎక్కాడు. ఇంటి నుంచి ఫోన్‌ రావడంతో తిరిగివచ్చి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇదిలా ఉండగా గత నెల 24న విఖ్యాత్‌ తొలి పుట్టిన రోజు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు. ఆ తీపి జ్ఞాపకాలు మరువకముందే చిన్నారి మృతి చెందడం కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచింది.  
చదవండి: Mukarram Jah: చివరి నిజాం రాజు మనవడు కన్నుమూత..

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)