Breaking News

కట్టుకున్నోడిని కాటికి పంపింది..

Published on Thu, 03/20/2025 - 08:50

వికారాబాద్‌ జిల్లా: మద్యానికి బానిసైన భర్త పెడుతున్న వేధింపులు భరించలేని ఓ భార్య కట్టుకున్నోడిని హతమార్చింది. మృతుడి తల్లి కూడా ఇందుకు సహకరించింది. తండ్రి హత్యకు గురికావడం, తల్లి, నాయనమ్మ పరారీలో ఉండటంతో ఇద్దరు పిల్లలూ బిక్కుబిక్కుమంటున్నారు. 

వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలం హన్మాపూర్‌లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. హన్మాపూర్‌కు చెందిన బక్కని వెంకటేశ్‌ (33)కు 14 ఏళ్ల క్రితం ఇదే ఊరికి చెందిన సబితతో వివాహం జరిగింది. వీరికి లావణ్య, కిషోర్‌ ఇద్దరు పిల్లలు సంతానం. తల్లి లక్ష్మమ్మ, భార్యాపిల్లలతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. కొంతకాలం క్రితం పొలం అ మ్మగా డబ్బులు రావడంతో వెంకటేశ్‌ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగివచ్చి భార్యతో గొడవ పడేవాడు. 

ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున వెంకటేశ్‌ ఇంటి ఆవరణలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తల్లి, భార్య మృతుడి సోదరుడైన శ్రీనివాస్‌కు విషయం చెప్పారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి సిబ్బందితో చేరుకొని పరిశీలించారు. తన అన్న మృతికి తల్లి, వదినే కారణమని శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమో దు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, లక్ష్మమ్మ, సబిత పరారీలో ఉన్నారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి రూరల్‌ సీఐ నగేశ్‌తో కలిసి హన్మాపూర్‌లో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)