Breaking News

డెహ్రాడూన్‌లో కుక్కల విద్యాసాగర్‌ అరెస్ట్‌

Published on Sat, 09/21/2024 - 03:59

విజయవాడ స్పోర్ట్స్‌ : ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడుగా ఉన్న వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌ను ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో అరెస్ట్‌ చేసినట్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు తెలిపారు. ఈ నెల 13వ తేదీన నటి జత్వాని ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే విద్యాసాగర్‌పై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశామన్నారు. 

ఆ వెంటనే అతడి కోసం ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేప­ట్టామని తెలిపారు. డెహ్రాడూన్‌లో ప్రత్యేక బృందాలు అత­న్ని పట్టుకున్నాయని, ఈ నెల 20న అరెస్ట్‌ చేసి.. డెహ్రాడూన్‌ మూడో అడిషనల్‌ చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజి్రస్టేట్‌ ముందు హాజరు పరిచాయన్నారు.  ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజ­యవాడ తీసుకొస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 

అంతా రివర్స్‌: సినీ నటి కాదంబరి జత్వాని తనను మోసం చేసిందని తొలుత కేసు పెట్టిందే కుక్కల విద్యాసాగర్‌. ఆమె ఫోన్లు వెనక్కు ఇవ్వద్దని, అలా ఇస్తే డేటా తొలగిస్తారని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి, పోరాడుతున్నది కూడా ఇతనే. పోర్జరీ సంతకాలతో భూమిని కొట్టేసేందుకు యత్నించిందని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇతని ఫిర్యా­దుతో జత్వానిపై కేసు నమోదు చేసి.. ముంబై నుంచి ఆమె­ను అరెస్ట్‌ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. 

ఇలా ఎంతో మందిని ఆమె మోసగించిందని విచారణలో తేలింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే టీడీపీ పెద్దలు ఆమెను అడ్డం పెట్టుకుని కొందరు ఐపీఎస్‌ అధికారులపై కక్ష సాధింపునకు దిగారు. ముగ్గురిని సస్పెండ్‌ కూడా చేశారు. కేసును తిమ్మినిబమ్మి చేసి తమ కక్ష సాధింపునకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇందులో భాగంగానే కుక్కల విద్యాసాగర్‌పై ఆమెతో ఉల్టా కేసు పెట్టించి, అరెస్ట్‌ చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిపై ఇలా కక్ష సాధిస్తున్నారు.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)