Breaking News

పనికెళ్లి తిరిగొస్తుండగా..

Published on Wed, 11/13/2024 - 03:51

పెద్దపల్లి రూరల్‌: కూలీ పనులు చేస్తూ పొట్టపోసుకునే ఇద్దరు అభాగ్యులను కారు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి శివారులో మంగళవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రంగంపల్లిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌కు సోమవారం రాత్రి ఓ విందు పనికి వెళ్లిన కుక్క భాగ్య (46), కుక్క అమృత (48), కుక్క పద్మ, కుక్క కాంత పని ముగించుకుని మంగళవారం వేకువజామున తమ ఇళ్లకు బయలుదేరారు. 

కాలినడకన రాజీవ్‌ రహదారి పక్కనుంచి వస్తుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భాగ్య, అమృత ఘటనా స్థలంలోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన పద్మ పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాంత గాయాలతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వీరంతా పెద్దపల్లి ఉదయ్‌నగర్‌కు చెందిన పాలెవాళ్లుగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

భాగ్యకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వారిలో ముగ్గురికి వివాహమవగా, దివ్యాంగురాలైన మరో కూతురు నవ్య ఇంటి వద్దే ఉంటోంది. భర్త కనకయ్య హమాలీగా పనిచేస్తున్నాడు. అమృత భర్త నర్సయ్య కూడా హమాలీగా పనిచేస్తున్నాడు. వారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఏసీసీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై లక్ష్మణ్‌కుమార్‌ సందర్శించారు. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)