Breaking News

మృత్యువులోనూ వీడని స్నేహబంధం

Published on Wed, 05/31/2023 - 11:21

గుంతకల్లు రూరల్‌: ఆ ఇద్దరూ ప్రాణస్నేహితులు.. ప్రతి పనినీ కలిసే చేసేవారు.. ఎక్కడికై నా కలిసే వెళ్లేవారు. చివరికి మృత్యువులోనూ వారు స్నేహం వీడలేదు. వివరాలు... గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన ఉరుకుందప్ప, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వీరన్న (26), అదే గ్రామానికి చెందిన రాము, మహాలక్ష్మి దంపతుల కుమారుడు రవీంద్ర (25) ఇటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం వీరన్నకు కృపాకుమారితో వివాహం కాగా, 6, 4 సంవత్సరాల వయసున్న ఇద్దరు బిడ్డలున్నారు. ఆరు నెలల క్రితం లక్ష్మి అనే యువతితో రవీంద్రకు వివాహమైంది.

వీరన్న, రవీంద్ర ఒకే గ్రామానికి చెందిన వారే అయినా.. ఆటోడ్రైవింగ్‌ ద్వారానే ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారారు. కొంత కాలం క్రితం ఇద్దరూ అనారోగ్యం బారిన పడ్డారు. వైద్య పరీక్షల అనంతరం గుండె సంబంధిత వ్యాధితో వీరన్న, షుగర్‌, బీపీతో రవీంద్ర బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఇద్దరూ మద్యానికి బానిసయ్యారు. దీంతో వారి ఆరోగ్యం మరింత క్షీణించింది. పది రోజుల క్రితం ఆయాసం ఎక్కువ కావడంతో వీరన్నను కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు.

రవీంద్ర ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించడంతో కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలులోని ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో మంగళవారం తెల్లవారుజాము 5 గంటలకు రవీంద్ర, 5.30 గంటలకు వీరన్న మృతిచెందారు. పోస్టుమార్టం అనంతరం మధ్యాహ్నం ఇద్దరి మృతదేహాలను కుటుంబసభ్యులు గ్రామానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.

#

Tags : 1

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌