Breaking News

గిరిజన పాఠశాల భూమి కబ్జా

Published on Sat, 06/15/2024 - 05:29

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారం చేపట్టిన గంటల వ్యవధిలోనే టీడీపీ నేతలు బరి తెగించారు. ప్రభుత్వ స్థలాల కబ్జాకు తెర తీశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి అండతో స్థానిక నేతలు చెలరేగిపోతున్నారు. వెంకటాచలం మండలం గొలగ­మూడి­లో టీడీపీ నాయకులకు ప్రభుత్వ భూమిపై కన్ను పడింది. అనుకున్నదే తడవుగా పట్ట పగలే జేసీబీ యంత్రంతో ఆ భూమిని చదును చేశారు. వెంకటాచలం మండలం గొలగమూడిలో ప్రభుత్వ ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలకు ఆనుకుని సీజేఎఫ్‌ఎస్‌ భూములున్నాయి. 

ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాల కోసం మరింత స్థలం కేటాయించాలని పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది కోరడంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీకి చెందిన వ్యక్తికి గతంలో సీజేఎఫ్‌ఎస్‌ పథకం కింద కేటాయించిన 1.25 ఎకరాల భూమిని పాఠశాల కోసం అప్పగించింది. వాస్తవానికి సీజేఎఫ్‌ఎస్‌ పథకం కింద కేటాయించిన భూమిపై ఏ వ్యక్తికీ అధికారం లేదు. ఈ భూమికి ఆర్డీవో హక్కుదారుగా ఉంటారు. సదరు వ్యక్తికి ప్రత్యామ్నాయంగా మరోచోట భూమిని కేటాయిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు. 

అయితే ఇంతలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ ఎన్నికల్లో సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గెలవడం, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ టీడీపీ నేత అది తన భూమేనంటూ దౌర్జన్యపూరితంగా ఆక్రమించేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఒక గిరిజన పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని ఆక్రమించే సాహసం చేయడం చూస్తే టీడీపీ నేతలు ఏ విధంగా బరి తెగించారో అర్థమవుతోంది. 

ఈ భూఆక్రమణను ఆశ్రమ గిరిజన పాఠశాల ఉపాధ్యాయినులు అడ్డుకోబోతే వారిని సైతం బెదిరించారు. ఈ భూమి పాఠశాలకు కేటాయించారని చెప్పినా వినకుండా చదును చేశారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరేందుకు సాక్షి ప్రయతి్నంచగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.  

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)