ప్రభుత్వాసుపత్రిలో ఘోరం

Published on Wed, 08/28/2024 - 06:10

జోధ్‌పూర్‌: రాజస్తాన్‌లోని మహాత్మాగాంధీ ప్రభుత్వాసుపత్రిలో ఘోరం చోటుచేసుకుంది. జోధ్‌పూర్‌ నగరంలోని ఈ ఆస్పత్రిలో 15 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఒకరు ఈ ఆస్పత్రిలో మాజీ ఉద్యోగి కావడం గమనార్హం. జోధ్‌పూర్‌ సిటీ(వెస్ట్‌) ఏసీపీ అనిల్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..  ఆదివారం సాయంత్రం బాలికను ఇంట్లో అమ్మ బాగా కోప్పడింది. దీంతో అలిగిన బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చి దగ్గర్లోని మహాత్మాగాంధీ ప్రభుత్వాసుపత్రికి చేరుకుంది. 

అక్కడ ఒంటరిగా తిరుగుతున్న బాలికతో అక్కడే ఉన్న ఇద్దరు యువకులు మాటలు కలిపారు. తర్వాత బాలికను ఆస్పత్రి వెనుకభాగంలో ఆస్పత్రి బయోవ్యర్థాలను నిల్వఉంచిన డంపింగ్‌ యాడ్‌ వద్దకు తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌ చేశారు. అమ్మాయి ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోవడంతో కుటుంబసభ్యులు బాగా వెతికి చివరకు సోమవారం సూరసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రి సమీపంలో బాలిక జాడ కనిపెట్టారు. అమ్మాయి దొరికిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. 

తల్లిదండ్రులు వచ్చాక ముందురోజు తాను ఎదుర్కొన్న భయానక ఘటనను తల్లిదండ్రులు, పోలీసులకు అమ్మాయి విడమరిచి చెప్పింది. దీంతో అమ్మాయిని ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి నిందితుల జాడ కోసం వేట మొదలెట్టారు. ఎట్టకేలకు నిందితులను అరెస్ట్‌చేసి ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ఉదయం డంపింగ్‌యార్డ్‌లోని ఘటనాస్థలికి వెళ్లి ఫోరెన్సిక్‌ బృందం సాక్ష్యాధారాలను సేకరించిందని ఏసీపీ చెప్పారు. 

‘‘ పోలీసులు ఆస్పత్రికి వచ్చారుగానీ అసలేం జరిగిందో మాకు చెప్పలేదు. మేం అంతర్గతంగా వివరాలు రాబట్టగా నిందితుల్లో ఒకడు మా ఆస్పత్రిలో గతంలో కాంట్రాక్ట్‌ పద్దతిలో ఉద్యోగం చేశాడని తెల్సింది’’ అని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఫతాసింగ్‌ భాటి చెప్పారు. రాత్రిళ్లు ఆస్పత్రి పరిసరాల్లో ఎక్కడా చీకటి ఉండొద్దు. లైట్లు బిగించండి. చీకటి ప్రాంతం కనిపించొద్దు’ అని సిబ్బందిని ఆయన ఆదేశించారు. 

విమర్శలు ఎక్కుపెట్టిన విపక్షాలు
బీజేపీ హయాంలో రాష్ట్రంలో ఆటవికపాలన నడుస్తోందని విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ‘‘ ఆటవిక ఏలుబడికి తాజా ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. శాంతిభద్రతల అంశం అటు ప్రజా ప్రతినిధులకు, ఇటు పోలీసులకు ఏమాత్రం పట్టట్లేదు. దీంతో నేరస్తులకు భయం లేకుండా పోయింది. 

ఒకప్పుడు నేరాలే జరగని జోధ్‌పూర్‌లో ఇప్పుడు బీజేపీ అస్తవ్యస్థపాలనతో నగరంలో అమ్మాయిలకు రక్షణ కరువైంది’’ అని కాంగ్రెస్‌ నేత, రాజస్తాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ అన్నారు. రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు అనేవే లేవని రాజస్తాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ గోవింద్‌సింగ్‌ దోస్తారా అన్నారు.  

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)