సైబర్‌ మోసం తాళలేక విద్యార్థి ఆత్మహత్య

Published on Wed, 01/01/2025 - 01:38

వీణవంక (హుజూరాబాద్‌): సైబర్‌ మోసానికి ఓ విద్యార్థి బలైపోయాడు. రూ. 5 వేలు పెట్టుబడి పెడి తే రెండింతలు ఇస్తాం’ అంటూ ఫోన్‌కు వచ్చిన మె సేజ్‌కు ఆకర్షితుడై పలు దఫాలుగా కేటుగాళ్లకు రూ.90 వేల మేర ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసి మోసపోయాడు. చివరకు మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం బేతిగ ల్‌ గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 

మహిళా సంఘం నుంచి తల్లి తీసుకున్న చిట్టీ డబ్బులతో.. 
బేతిగల్‌ గ్రామంలో నివసిస్తున్న గుమ్మడి సృజన్‌–ఉమ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రిషివర్థన్‌ (18) ఇటీవల డిప్లొమా పూర్తి చేసి బీటెక్‌ ప్రయత్నాల్లో ఉన్నాడు. వారం క్రితం అతని మొబైల్‌కు కేటుగాళ్లు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట పంపిన సందేశం చూసి ఆకర్షితుడయ్యాడు. తన తల్లి ఇటీవల మహిళా సంఘం నుంచి రూ. 90 వేల చిట్టీ పాడుకోవడంతో వచ్చిన డబ్బును ఇందుకోసం వాడుకోవాలనుకున్నాడు. వెంటనే ఆమె ఖాతాలోంచి ఆ సొమ్మును తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. 

తొలుత రూ. 5 వేలను సైబర్‌ నేరగాళ్ల ఖాతాకు పంపాడు. అయితే రెట్టింపు సొమ్ము పొందాలంటే రెండో టాస్‌్కగా రూ. 23,500 పెట్టుబడి పెట్టాలంటూ వారు మెలిక పెట్టడంతో ఆ సొమ్మునూ చెల్లించాడు. మూడో టాస్‌్కలో రూ. 68 వేలు పెట్టుబడి పెడితే రీఫండ్‌ వస్తుందని కేటుగాళ్లు నమ్మించడంతో ఆ మొత్తం కూడా బదిలీ చేశాడు. అయితే ఆ సొమ్ముకు రెట్టింపు పొందాలంటే రూ. 2 లక్షల 6 వేలను బదిలీ చేయాలని వారు పేర్కొనడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. 

అంతకుముందు కుటుంబ సభ్యులకు లేఖ రాశాడు. ‘సారీ మమ్మీ.. నేను చనిపోతున్నా, రిన్నూ (తమ్ముడు) జాగ్రత్త.. డాడీ, మమ్మీ ఇన్నీ రోజులు నన్ను భరించినందుకు థ్యాంక్స్‌. నేను ట్రేడింగ్‌ (స్టాక్‌ మార్కెట్‌)లో డబ్బులు పెట్టి మోసపోయా. కంపెనీ వివరాలు నా మొబైల్‌లో ఉన్నాయి’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)