Breaking News

ఆటోను ఢీకొన్న మోటార్‌ బైక్‌.. ఇద్దరు విద్యార్థులు మృత్యువాత

Published on Sat, 12/21/2024 - 04:59

తవణంపల్లె: చిత్తూరు, కాణిపాకం రోడ్డు సత్తారు బావి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృత్యువాత పడ్డారు.  తవణంపల్లె ఎస్‌ఐ చిరంజీవి కథనం మేరకు.. మండలంలోని ముత్తరపల్లె గ్రామానికి చెందిన గోవిందు కుమారుడు సాయితేజ (19), మైనగుండ్లపల్లెకు చెందిన ప్రసాద్‌రెడ్డి కుమారుడు హర్ష (19) ఇద్దరు స్నేహితులు. 

వీరిద్దరూ చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.  శుక్రవారం సాయితేజ తన మోటార్‌ సైకిల్‌లో తన స్నేహితుడు హర్షను వెనుక కూర్చోబెట్టుకుని పరీక్ష రాయడానికి కాలేజ్‌కు బయలుదేరారు. ఈ తరుణంలో సత్తారు బావి సమీపంలో ముందు వెళ్తున్న బస్సును అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొన్నారు. 

ప్రమాదంలో సాయితేజ, హర్షకు బలమైన గాయాలు కావడంతో తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. దీంతో క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం చిత్తూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు నిర్థారించారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)