Breaking News

ఏలూరులో మహిళపై సామూహిక అత్యాచారం

Published on Sun, 08/18/2024 - 06:03

ఏలూరు టౌన్‌: కోల్‌కతాలో డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ.. ఏలూరులో ముగ్గురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేయడం స్థానికంగా కలకలం రేపింది. భార్యాభర్తలు నిద్రిస్తున్న సమయంలో భర్తను చితక్కొట్టి.. భార్యను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన ఆ మృగాళ్ల ఉన్మాదానికి పరాకాష్టగా నిలుస్తోంది. పోలీసులు వెంటనే స్పందించకపోవడం, ఘటన వివరాలు ఓ వ్యక్తి వెంటనే తెలిపినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తే.. కూటమి సర్కారులో మహిళలకు భద్రత కరువైందన్న దానికి తార్కాణంలా ఈ ఘటన నిలుస్తోంది.

భర్త ఫిర్యాదుతో ఏలూరు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలికి ఏలూరు జీజీహెచ్‌లో వైద్యచికిత్స అందిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ అమానుష ఘటన వివరాలు.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలానికి చెందిన భార్యాభర్తలు జీవనోపాధి కోసం 20 రోజుల క్రితం ఏలూరు నగరానికి వచ్చారు. వన్‌టౌన్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌లో పనికి కుదిరారు. రాత్రి వేళల్లో స్థానికంగా ఉన్న ఆధ్యాతి్మక వేదిక రామకోటిలో నిద్రపోయి.. ఉదయం లేచి పనులకు వెళుతున్నారు. జీతం వచ్చాక అద్దె ఇల్లు కూడా తీసుకోవాలని భావించారు. వీరు ఇలా జీవించడం చూసిన ముగ్గురు జులాయి యువకులు కొద్ది రోజులుగా భర్తతో స్నేహంగా ఉంటున్నారు. 

శుక్రవారం రాత్రి ముగ్గురు యువకులు భర్తకు మద్యం తాగించారు. అతను మత్తులో మునిగి నిద్రపోగా.. అతని భార్య (35)ను అక్కడి నుంచి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె కేకలు వేయగా.. మెలకువ వచి్చన భర్త వారిని అడ్డగించాడు. యువకులు బలమైన కర్రతో భర్త కాళ్లను చితక్కొట్టారు. అనంతరం మహిళను సమీపంలోని భవనంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె ముఖంపైనా బలంగా కొట్టారు.   

పోలీసుల అలసత్వం 
కాళ్లపై బలంగా దెబ్బతిన్నా.. భర్త రోడ్డుపైకి వచ్చి సాయం కోసం అరిచాడు. సినిమా చూసి అటుగా వెళుతున్న బాలాజీ అనే యువకుడు ఇది గుర్తించి డయల్‌ 100కు ఫోన్‌ చేయగా సిబ్బంది పట్టించుకోలేదు. చేసేది లేక ఏలూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడి సిబ్బందికి జరిగిన విషయాన్ని చెప్పగా.. వారు వెంటనే స్పందించకుండా ఆలస్యం చేశారు. పోలీసులు వెంటనే స్పందించకపోవడంతో బాలాజీ.. తన స్నేహితులకు ఫోన్‌ చేసి ఘటనా స్థలానికి వెళ్లాడు. వీరు వెళ్లాక నిందితులు ముగ్గురూ బాధిత మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు.  

ముగ్గురు నిందితుల అరెస్ట్‌ 
మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ముగ్గురినీ ఏలూరు వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం ఏలూరు వన్‌టౌన్‌ గజ్జవారి చెరువు వద్ద బిట్టు బార్‌ ఎదురుగా రోడ్డుపై నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జులాయిగా తిరిగే ఈ నిందితులు ఏలూరు టీచర్స్‌ కాలనీలో చెంచుకాలనీ రోడ్డు ప్రాంతానికి చెందిన నూతిపల్లి పవన్, లంబాడీపేట, సాయిబాబా గుడి ప్రాంతానికి చెందిన నారపాటి నాగేంద్ర, ఎంఆర్‌ఆర్‌ కాలనీ 13వ రోడ్డు ప్రాంతానికి చెందిన గడ్డి విజయకుమార్‌ అని పోలీసులు వెల్లడించారు. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)