విషాదం.. క్వారీ గుంతలో పడి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సహా ముగ్గురి మృతి

Published on Wed, 07/17/2024 - 13:33

సాక్షి, సూర్యాపేట: క్వారీ గుంతలోపడి ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఆత్మకూరు (ఎస్‌) మండలం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి హాజరై క్వారీ చూసేందుకు వెళ్లి.. ప్రమాదవాశాత్తు అక్కడి గుంతలో పడి ప్రాణాలు విడిచారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీపాల్‌ రెడ్డి, రాజు స్నేహితులు. వీరిద్దరూ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. శ్రీపాల్‌ రెడ్డి బిల్డర్‌గా, రాజు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

మంగళవారం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి వారు తమ కుటుంబాలతో సహా హాజరయ్యారు. బుధవారం ఉదయం శ్రీపాల్‌ రెడ్డి, రాజు, ఆయన కుమార్తె (12) క్వారీ చూడటానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాజు కుమార్తె క్వారీ గుంతలో పడిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు రాజు, శ్రీపాల్‌ రెడ్డి లు ఇద్దరూ ఆ గుంతలో దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)