Breaking News

విధి అంటే ఇదేనేమో.. స్వగ్రామానికి వస్తూ అనంతలోకాలకు.. 

Published on Fri, 06/02/2023 - 13:50

కొణిజర్ల: పిల్లల సెలవులు కొద్ది రోజుల్లో ముగియనున్నాయి.. దీంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఆ దంపతులు ఊళ్లో ఉంటున్న తల్లిదండ్రులతో కలిసి తిరుమల వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ క్రమంలో కారులో స్వగ్రామానికి వస్తుండగా లారీ రూపంలో వారిని మృత్యువు కబళించింది. 

ఖమ్మం జిల్లా కొణిజర్ల వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి రాజేష్‌(40) భార్య సుజాత(35), కుమారులు దివిజిత్‌ శ్రీరామ్, అశ్విత్‌ శ్రీరామ్‌(13)తో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్రగతినగర్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. పిల్లలకు వేసవి సెలవులు ముగియనుండడంతో విప్పలమడకలో ఉంటున్న తల్లిదండ్రులతో కలిసి తిరుమల తిరుపతి వెళ్లాలని రాజేష్‌ భావించారు.

ఈ క్రమంలో కారులో హైదరాబాద్‌ నుంచి విప్పలమడకకు బుధవారం రాత్రి బయలుదేరారు. ఇంతలోనే కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌ సమీపాన జాతీయ రహదారిపై ఒక ట్యాంకర్‌ మరమ్మతుకు రావడంతో రోడ్డుపైనే ఆగిపోయింది. ఆ ట్యాంకర్‌ వెనుకాల మరో లారీ ట్యాంకర్‌ను డ్రైవర్‌ నిలిపివేశాడు. అదే క్రమంలో రాజేష్‌ కూడా తమ కారుని ఆపాడు. అయితే, వెనుక నుంచి మరో లారీ అతివేగంగా వచ్చి వీరి కారును బలంగా ఢీకొట్టడంతో రెండు లారీల మధ్య కారు ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. ఘటనలో రాజేష్, సుజాత, అశ్విత్‌ ఘటనాస్థలిలోనే మృతి చెందగా పెద్దకుమారుడు దివ్యజిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇంకో అర గంటలో ఇంటికి చేరతారనగా ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.  

ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో షాక్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)