Breaking News

కొత్త సంవత్సర వేడుకలకు వస్తూ ప్రమాదం.. ముగ్గురు మృతి

Published on Wed, 01/01/2025 - 09:48

జమ్మలమడుగు: ఏడాది చివరి రోజే వారి జీవితానికి ఆఖరు రోజు అవుతుందని అనుకోలేదు. అతివేగం వారి ప్రాణాలను హరించింది. సంఘటన స్థలంలోనే ఒకరు మరణించగా మరొకరు ఇద్దరు  ప్రభుత్వాసుపత్రిలో మరణించారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా..

పులివెందుల నియోజకవర్గంలోని వే ముల, లింగాల, పులివెందుల ప్రాంతాల కు చెందిన ఏడుగురు స్నేహితులు జనవరి వేడుకలను నిర్వహించుకునేందుకు పర్యాటక కేంద్రమైన గండికోటకు పులివెందుల నుంచి బయలు దేరారు. వీరిలో లింగా ల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన అబ్దుల్‌, వేముల మండలం భూమ య్యగారిపల్లికి చెందిన నందీష్‌, పులివెందులకు చెందిన జగన్‌, షాహుల్‌, సింహాద్రిపురం అగ్రహారానికి చెందిన చైతన్య, షాజహాన్‌, ప్రేమ్‌ ఉన్నారు. ముద్దనూరు కొండ దిగిన తర్వాత చిటిమిటి చింతల గ్రామానికి సమీపంలో ఉన్న దర్గా మలుపు వద్దకు రాగానే వేగంగా వస్తున్న స్కార్పియోను అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొన్నారు. 

వేముల మండలం భూమయ్యగారిపల్లి గ్రామానికి చెందిన నందీష్‌(21) అక్కడికక్కడే మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న లింగాల మండలం పెద్ద కుడాల గ్రామానికి చెందిన అబ్దుల్‌(25)ను జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తీసుకు రాగా చికిత్స పొందుతూ మరణించాడు. పులివెందులకు చెందిన జగన్‌ పరిస్థితి విషమించడంతో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ జగన్‌ మృతి చెందాడు   . చైతన్య, షాజహాన్‌, ప్రేమ్‌, షాహుల్‌ జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్బన్‌ పోలీసులు కేసు నమో దు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Videos

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)