Breaking News

HYD: స్పా సెంటర్లలో రాసలీలలు.. ముగ్గురు కానిస్టేబుల్స్‌ సస్పెండ్‌

Published on Wed, 08/28/2024 - 09:25

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పోలీసు శాఖలో సంచలన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని మధురా నగర్‌ పీఎస్‌ పరిధిలో స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల నుండి నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు కానిస్టేబుల్స్‌ను సీపీ సస్పెండ్‌ చేశారు.

వివరాల ప్రకారం.. మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుల్స్‌ నామోదర్‌, నాగరాజు, సతీష్‌లను సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి  సస్పెండ్ చేశారు. అయితే, వీరు ముగ్గురు పీఎస్‌ పరిధిలోని స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల నుంచి నెలవారీ వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. లంచాలతోపాటుగా అక్కడి యువతులతో వీరు రాసలీలలకు కూడా పాల్పడుతున్నారని ఫిర్యాదు కూడా వచ్చాయి. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

ఈ క్రమంలో సదరు స్పా సెంటర్‌లోకి ముగ్గురు కానిస్టేబుల్స్‌, మరో హోంగార్డ్‌ వెళ్లిన దృశ్యాలను పోలీసులు.. సీసీ కెమెరాల్లో పరిశీలించారు. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ముగ్గురు కానిస్టేబుల్స్‌ను సీపీ సస్పెండ్‌ చేశారు. అలాగే, వారితోపాటు ఉన్న హోంగార్డ్‌ రాజును పోలీసు శాఖకు చెందిన మోటారు ట్రాన్స్‌పోర్టుకు పంపించి చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)