Breaking News

చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి

Published on Sun, 04/14/2024 - 06:17

మాక్లూర్‌: చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం ఒడ్డేట్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేశ్‌ (20), తిరుపతి(19), నరేశ్‌ (20), సాయితేజ, వినోద్‌లు శనివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే చెరువులో మొరం కోసం తవ్విన లోతైన గుంతలు ఉన్నాయి. ఈ విషయం తెలియని మహేశ్, తిరుపతి, నరేశ్‌ చెరువులోకి దిగిన వెంటనే లోతైన గుంతల్లోకి జారి మునిగి పోయారు. ఒడ్డునే ఉన్న సాయితేజ, వినోద్‌ వెంటనే తేరుకుని గ్రామంలోనికి వెళ్లి సమాచారం ఇచ్చారు.

పెద్దఎత్తున గ్రామస్తులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ముగ్గురూ మృతిచెందడంతో గజ ఈతగాళ్లతో ముగ్గురి మృత దేహాలను బయటకు తీయించారు. మృతుల తల్లిదండ్రులకు వారు ఒక్కొక్కరే సంతానం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుల్లో తిరుపతి 10వ తరగతి, నరేశ్, మహేశ్‌లు ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. మాక్లూర్‌ ఎస్సై సుధీర్‌రావు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలాన్ని ట్రెయినీ ఐపీఎస్‌ అధికారి చైతన్యరెడ్డి, నార్త్‌జోన్‌ సీఐ సతీశ్‌ పరిశీలించారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)