Breaking News

మాకు అడ్డొస్తే చంపేస్తాం..

Published on Wed, 09/11/2024 - 04:29

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ‘మేము అధికారంలో ఉన్నాం.. మేం ఏం చెప్పినా జరుగుతుంది’ అంటూ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండల టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత  అండ చూసుకుని రోజూ మండలంలోని ఏదో ఒక గ్రామంలో అలజడి సృష్టిస్తున్నారు. 

మంగళవారం కుంటిమద్ది ఎంపీటీసీ సభ్యురాలు ఉమాదేవి భర్త కేశవను పరిటాల అనుచరుడు గంగాధర్‌ నాటు తుపాకీ, కత్తితో బెదిరించాడు. తమకు అడ్డొస్తే చంపేస్తామంటూ వీరంగం సృష్టించాడు. అతని తీరుతో విసుగు చెందిన గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.  ఇతను గతంలోనూ పెనుకొండ, ధర్మవరం తదితర ప్రాంతాల్లో బెదిరింపులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. 

ఆధిపత్యం కోసం అలజడులు 
స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని తొమ్మిది పంచాయతీలకు గాను ఏడుచోట్ల వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. తొమ్మిది ఎంపీటీసీ స్థానాలనూ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 

దీన్ని జీరి్ణంచుకోలేని పరిటాల కుటుంబం సొంత మండలంలో ఆధిపత్యం కోసం గ్రామాల్లో గొడవలకు ఆజ్యం పోస్తోంది. ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామమైన కుంటిమద్దిలో అలజడి సృష్టించే క్రమంలోనే పరిటాల అనుచరుడు గంగాధర్‌ ఎంపీటీసీ భర్తను తుపాకీతో బెదిరించాడని స్థానికులు చెబుతున్నారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)