Breaking News

రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్‌

Published on Thu, 05/30/2024 - 04:23

అబిడ్స్‌(హైదరాబాద్‌): గోషామహల్‌ ఎమ్మె ల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. బుధవారం ఉదయం 9:19 గంటల నుంచి క్రమం తప్పకుండా తన ఫోన్‌కు గుర్తు తెలియనివ్యక్తులు బెదిరింపు కాల్స్‌ చేస్తూనే ఉన్నారని రాజాసింగ్‌ సోషల్‌ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. చేసిన ప్రతిసారి ఒక్కో నంబర్‌ నుంచి కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు.

కొన్నిసార్లు వాయిస్‌ మెసేజ్‌ కూడా చేసి బెదిరిస్తున్నారన్నారు. వచ్చిన కాల్స్‌లో పాలస్తీనాకు చెందిన ఒక తీవ్రవాది ఫొటో, నంబరు స్పష్టంగా కనిపించిందని రాజాసింగ్‌ వెల్లడించారు. బెదిరింపు కాల్స్‌ చేసిన వ్యక్తి తనను ఇంకో నంబరు ఉందా? అని అడిగాడని, దానికి సమాధానంగా గూగుల్‌లో అన్వేషించి సీఎం రేవంత్‌రెడ్డి నంబర్‌ను ఇచ్చానని తన వీడియోలో పేర్కొన్నారు. 

కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్‌ చాలాసార్లు వచ్చాయని, పోలీసు ఉన్నతాధికారులు, అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఒక్కరిని కూడా అరెస్ట్‌ చేయలేదన్నారు. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్‌ వస్తే అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారన్నది కూడా పోలీసులు తెలుసుకోలేకపోయారని ఆ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉందని, మళ్లీ బెదిరింపు కాల్స్‌ వస్తున్నందున సీఎం రేవంత్‌రెడ్డి నంబర్‌ను ఇచ్చానని, ఒకవేళ ఆ వ్యక్తులు ఆ నంబరకు బెదిరింపు కాల్స్‌ చేస్తే ప్రభుత్వం, పోలీసులు విచారణ జరిపిస్తారేమో అనే భావంతోనే సీఎం నంబర్‌ ఇచ్చానంటూ రాజాసింగ్‌ వెల్లడించారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)