Breaking News

‘సిగ్నల్‌’ చోరీ

Published on Sun, 06/09/2024 - 05:13

సాక్షి, అమరావతి: దేశంలో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ సమస్య పెరుగుతోంది. ఫోన్‌ చేస్తే మధ్యలోనే కాల్‌ డ్రాప్‌ అవుతోంది. ఒక్కోసారి సిగ్నల్‌ ఉన్నట్టే ఉంటుంది.. కానీ ఫోన్‌ మాత్రం కలవదు. ఇవన్నీ తమ వల్ల వచ్చిన సమస్యలు కావని.. సెల్‌ టవర్లపై దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో తలెత్తిన సమస్యలని నెట్‌వర్క్‌ ఇంజనీర్లు, టెలికాం సంస్థలు చెబుతున్నాయి. 

గత 6 నెలల్లో దేశవ్యాప్తంగా 17 వేల రేడియో రిమోట్‌ యూనిట్లు(ఆర్‌ఆర్‌యూ) చోరీకి గురయ్యాయి. టెలి కమ్యూనికేషన్స్‌లో ట్రాన్స్‌ రిసీవర్‌గా ఆర్‌ఆర్‌యూ ఉపయోగపడుతుంది. ఇది ట్రాన్స్‌మిషన్‌ పనితీరును, మొబైల్‌ సిగ్నల్‌ల స్వీకరణను మిళితం చేస్తుంది. ఆర్‌ఆర్‌యూలు చోరీకి గురవుతుండటంతో సిగ్నల్‌ సమస్యలు పెరిగిపోతున్నాయని టెలికాం నిపుణులు చెబుతున్నారు. 

ఈ తరహా దొంగతనాలతో దేశవ్యాప్తంగా టెలికాం కంపెనీలు రూ.800 కోట్ల మేర నష్టాలను చవిచూశాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దొంగిలించిన ఆర్‌ఆర్‌ యూనిట్లును చైనా, బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో సెల్యులార్‌ ఆపరేటర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీఓఏఐ).. ఆర్‌ఆర్‌యూ దొంగతనాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. దేశ డిజిటల్‌ భవిష్యత్‌కు ఉపయోగపడే కీలక మౌలిక సదుపాయాలను రక్షించడానికి కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడుతోంది.

ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ.. 
గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ తరహా దొంగతనాలు పెరిగాయి. గుజరాత్‌తో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.  

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)