Breaking News

వారం రోజుల్లో పరీక్షలు.. అంతలోనే దుర్మరణం

Published on Mon, 03/11/2024 - 09:02

బంజారాహిల్స్‌: వారంరోజుల్లో పదోతరగతి పరీక్షలు.. ఈలోగా స్నేహితులతో సరదాగా గడుపుదామనుకున్నాడు.. అంతలోనే ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బోరబండకు చెందిన ఆటోడ్రైవర్‌ జగదీశ్‌ కుమారుడు భరణిసాయి లోకేష్(15) అదే ప్రాంతంలోని ఎస్‌వీఎస్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు.

 ఈ నెల 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా ఆదివారం ఉదయం నలుగురి స్నేహితులతో కలిసి బైక్‌లపై బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కుకు బయలుదేరారు. శ్రీనగర్‌కాలనీ టీవీ9 జంక్షన్‌లో సాయిలోకేశ్‌ బైక్‌ను టర్న్‌ చేసే క్రమంలో అదుపుతప్పింది. దీంతో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి ఎగిరి స్ట్రీట్‌లైట్‌ స్తంభానికి తగలడంతో సాయిలోకేశ్‌ తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు. పక్కనే బైక్‌లు నడుపుతున్న స్నేహితులు ఒక్కసారిగా వచి్చన పెద్ద శబ్దం విని షాక్‌కు గురయ్యారు. రెప్పపాటులో రక్తపుమడుగులో ఉన్న స్నేహితుడిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. 

ఒక్కగానొక్క కొడుకు కళ్లముందే విగతజీవిగా మారడంతో జగదీశ్‌తోపాటు కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. శనివారం రాత్రే కొడుకును తీసుకెళ్లి రహమత్‌నగర్‌లో పరీక్షాకేంద్రాన్ని చూసి వచ్చానని, ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుందని తండ్రి బోరున విలపించాడు. బంజారాహిల్స్‌ పోలీసులు ఘటనాస్థలంలో సీసీ ఫుటేజీలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్‌ ధరించి ఉంటే ఆ బాలుడు బతికి ఉండేవాడని పోలీసులు వెల్లడించారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)