Breaking News

మరో యువతితో ప్రేమాయణం.. ఇది తెలియడంతో హైదరాబాద్‌ వెళ్లి

Published on Sun, 04/02/2023 - 09:19

సాక్షి, నిజామాబాద్‌(మాక్లూర్‌): ప్రేమికుడి వేధింపులను తట్టుకోలేక విషం తాగిన యువతి చికిత్స పొందుతూ 9 రోజుల అనంతరం మృతి చెందింది. కోపోద్రిక్తులైన మృతురాలి బంధువులు యువకుడి ఇంటిపై దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం మాణిక్‌ భండార్‌ తండాకు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ అభిలాష్, అదే తండాకు చెందిన కెతావత్‌ రాజేశ్వరి (19) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇటీవల అభిలాష్‌ మరో యువతితో ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలిసిన రాజేశ్వరి అతనితో గొడవ పడింది. దూరంగా ఉండాలనే ఉద్దేశంతో రెండునెలల క్రితం హైదరాబాద్‌ వెళ్లి ఓ జ్యూయలరీ షాప్‌లో జాబ్‌లో చేరింది.

అయితే అభిలాష్‌ తరుచూ ఫోన్‌ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ వేధించటంతో తిరిగి మార్చి 20న రాజేశ్వరి తండాకు వచ్చింది. అభిలాష్‌ నుంచి వేధింపులు ఎక్కువ కావటంతో గతనెల 23న రాత్రి 8 గంటల సమయంలో విషం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా..పరిస్థితి విషమించి రాజేశ్వరి శనివారం మృతి చెందింది. విషయం తెలిసిన తండాలోని యువతి బంధువులు అభిలాష్‌ ఇంటిపై దాడి చేశారు. మృతురాలి తండ్రి దుబాయ్‌లో ఉన్నాడు. తల్లి, అనూష, అన్న తరుణ్‌ వ్యవసాయ పనులు చేస్తారు. పోలీసులు అభిలాష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)