ట్యాపింగ్‌కు సహకరించిందెవరు? ప్రణీత్‌రావుపై ప్రశ్నల వర్షం

Published on Tue, 03/19/2024 - 12:24

సాక్షి,హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో అరెస్టయి తమ కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును మూడోరోజు మంగళవారం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ ఏసీపీ నేతృత్వంలో బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్‌ను పోలీసులు విచారిస్తోంది.

ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి గతంలో ఎస్‌బీఐ అధికారులు ఎవరెవరు సహకరించారన్నదానిపై పోలీసులు ప్రణీత్‌ నుంచి కూపీ లాగుతున్నారు. సహకరించిన వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ధ్వంసం చేసిన ప్రణీత్‌రావు కంప్యూటర్‌ల హార్డ్‌ డిస్క్‌లు ఎక్కడ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హార్డ్‌ డిస్క్‌లు దొరికిన తర్వాత వాటి నుంచి డేటా పునరుద్ధరిస్తే ఎవరెవరి ఫోన్‌ ట్యాప్‌ చేశారు, ఎందుకు చేశారనే కీలక విషయాలు బయటికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కేవలం ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ చెప్పిన నెంబర్లు మాత్రమే ప్రణీత్‌రావు ట్యాప్‌ చేయలేదని.. పలువురు రాజకీయ నేతలు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు చెప్పిన నెంబర్లను సైతం ప్రణీత్‌రావు ట్యాప్‌ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బేగంపేట ఎస్‌ఐబీలోని కీలకమైన లాగర్‌ రూంను ఇందుకు వినియోగించుకున్నారని.. అలాగే అక్కడి సిబ్బందిని ప్రమోషన్‌ ఆశ చూపించి రహస్యాలేవీ బయటకు రాకుండా జాగ్రత్తపడ్డట్లు తేలింది. ప్రస్తుతం ప్రణీత్‌రావును క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేస్తున్న స్పెషల్‌ టీం.. అతని డైరీలో దొరికిన వందల నెంబర్లపై ప్రశ్నలు గుప్పిస్తూ మరింత సమాచారం రాబట్టేందుకు యత్నిస్తోంది. 
  

ఇదీ చదవండి.. ఇబ్రహీంపట్నంలో పరువు హత్య 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)