Breaking News

బట్టలు ఉతికేందుకు వెళ్లి ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

Published on Tue, 05/09/2023 - 08:50

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం మూడు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు బాలికలు, ఓ మహిళ మృతి చెందారు. వనపర్తి జిల్లాలో బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్లిన ముగ్గురు అక్కాచెల్లెళ్లలో చిన్నమ్మాయి ప్రమాదవశాత్తు నీటిలో పడడంతో ఆమెను కాపాడేందుకు అక్కలు కూడా నీటిలో దిగడంతో ఈత రాక ముగ్గురూ మృత్యువాత పడ్డారు.

శ్రీరంగాపురం మండలంలోని తాటిపాములకు చెందిన గంధం కురుమయ్య, భాగ్యమ్మ దంపతుల కుమార్తెలు తిరుపతమ్మ(16), సంధ్య (12), దీపిక (10) బట్టలు ఉతకడానికి గ్రామంలోని వీరసముద్రం చెరువు దగ్గరకు వెళ్లారు. బట్టలు ఉతుకుతున్న సమయంలో చిన్న అమ్మాయి దీపిక కాలు జారి చెరువులో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు ఇద్దరు అక్కలు చెరువులోకి దిగడంతో అక్కడే గొయ్యి ఉండడంతో ఈత రాక నీట మునిగిపోయారు. 

ఈతకు వెళ్లి మరో ముగ్గురు: నారాయణపేట జిల్లాలో పెళ్లింటికి వచ్చిన ముగ్గురు బాలికలు కోయిల్‌సాగర్‌ వాగు (ఊకచెట్టువాగు)లోకి ఈతకు వెళ్లి మృతి చెందారు. మరి కల్‌ మండలం రాకొండ గ్రామానికి చెందిన భాగ్యమ్మ, అశోక్‌ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. హైదరాబాద్‌కు చెందిన ఓ అబ్బాయితో ఆదివారం పెద్దకూతురు పెళ్లి జరిపించి సోమవారం రాకొండకు చేరుకున్నారు.

పెళ్లికూతురు సోదరి రాధిక (16)తో పాటు నర్వమండలం పాతర్‌చేడ్‌కు చెందిన బంధువులు సువర్ణ, గణేష్‌ దంపతుల కుమార్తెలు శ్రావణి (15), మహేశ్వరి (14), మరో ఇద్దరు శశికళ, చంద్రకళ కోయిల్‌సాగర్‌ ఊకచెట్టు వాగులో కి ఈతకు వెళ్లారు. కాగా.. ఇసుక కోసం తీసిన గుంత లోతుగా ఉండడంతో రాధిక, శ్రావణి, మహే శ్వరి నీటిలో మునిగిపోయారు. వారిని కాపాడే యత్నంలో శశికళ కూడా నీటిలోకి జారుతుండగా.. వెంటనే అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

పిల్లలకు ఈత నేర్పించేందుకు బావిలోకి దిగి... 
నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలం బావాయిపల్లికి చెందిన తెలుగు లింగమ్మ(30) భర్త లింగస్వామితో కలిసి పిల్లలకు ఈత నేర్పించేందుకు వ్యవసాయబావిలోకి దిగింది. అయితే ఈత సరిగ్గా రాక బావి నీటిలో మునిగిపోయింది. భర్తతో పాటు చుట్టుపక్కల వాళ్లు ఎంత వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో ఫైర్‌ సిబ్బంది వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు.
చదవండి: బిడ్డా పదేండ్ల తర్వాత వస్తిని.. మినరల్‌ వాటర్‌ కోసం పోయి..

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)