Breaking News

పెట్టుబడుల ఆశచూపి.. అందినకాడికి దోపిడీ

Published on Sun, 03/03/2024 - 05:27

సాక్షి, హైదరాబాద్‌: స్టాక్‌ మార్కెట్‌లో తాము చెప్పే కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీచేస్తున్నారు సైబర్‌ కేటుగాళ్లు. షేర్ల కొనుగోలు పేరిట అమాయకులకు గాలం వేసి రూ.కోట్లలో దోచుకుంటున్నారు. ఈ తరహా ఐపీఓ ట్రేడింగ్‌ మోసాలు ఇటీవల పెరిగినట్టు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్స్‌)లను ఇన్‌స్టిట్యూషన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కింద కొనుగోలు చేయండి అంటూ సైబర్‌ నేరగాళ్లు నమ్మబలుకుతున్నట్టు పేర్కొంది. 2023లో ఈ తరహా కేసులు 627 నమోదు కాగా, బాధితులు రూ.3,91,54,683 పోగొట్టుకున్నట్టు టీఎస్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. ఈ ఏడాదిలో రెండు నెలల్లోనే మొత్తం 213 కేసులు నమోదయ్యాయని, బాధితులు రూ.27,40,76,211 పోగొట్టుకున్నట్టు అధికారులు తెలిపారు.  

ఇలా మోసగిస్తున్నారు..
సైబర్‌ మోసగాళ్లు తొలుత వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్‌ వంటి సోషల్‌ మీడియా యాప్‌ల ద్వారా లింక్‌లు పంపుతున్నారు. ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్‌(ఎఫ్‌పీఐ)ల వంటి ఇన్‌స్టిట్యూషనల్‌ విధానాల్లో ఐపీఓలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలుకుతున్నారు. ఈ ప్రకటనలు నమ్మి ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపితే, వారిని ఫేక్‌ ట్రేడింగ్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునేలా సైబర్‌ నేరగాళ్లు ప్రోత్సహించి తమ అదీనంలో ఉండే బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేయించుకుంటారు.

నకిలీ యాప్‌లో బోగస్‌ డ్యాష్‌ బోర్డులను సృష్టించి వారికి లాభాలు వస్తున్నట్టుగా చూపుతున్నా రు. మరింత పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయ ని నమ్మిస్తారు. బాధితులు చివరకు తమ సొమ్మును డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు మోసపోయిన విషయం తెలుస్తుంది. ఈ తరహా ట్రేడింగ్‌ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నా రు. ఒకవేళ తాము మోసపోయినట్టు గుర్తిస్తే బాధితులు వెంటనే 1930 టోల్‌ఫ్రీనంబర్‌లో లేదా  cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)