Breaking News

ఎంత పనిచేశాడు.. హెయిర్‌ స్టయిల్‌ నచ్చలేదని బాత్‌రూమ్‌లోకి వెళ్లి..

Published on Thu, 04/06/2023 - 15:04

ముంబై: ఇటీవల టీనేజర్లు చిన్న విషయాలకు కలత చెందడం, గొడవలకు దిగడం, అంతెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. క్షణికావేశంలో నిండు నూరేళ్లు జీవితాన్ని అర్థంతరంగా ముగించుకుంటున్నారు. ఇంట్లో తమ తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. తాజాగా ఓ టీనేజర్‌ హెయిర్‌కట్‌ నచ్చలేదని బిల్డింగ్‌పై నుంచి దూకేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మహరాష్ట్రలోని భయాందర్‌ నగరానికి చెందిన ‌13 ఏళ్ల బాలుడికి కుటుంబ సభ్యులు హెయిర్‌ కట్‌ చేయించారు. అయితే షాపు అతను చేసిన హెయిర్‌ కటింగ్‌ ఆ బాలుడికి అసలు నచ్చలేదు. ఇంటికి వెళ్లాక అద్దంలో పదే పదే ఆ హెయిర్‌ స్టైల్‌ను చూసుకుంటూ తనకు నచ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ దశలో కోపోద్రిక్తుడైన ఆ బాలుడు అపార్ట్‌మెంట్‌ భవనం 16వ అంతస్తులోని బాత్‌రూంలోకి వెళ్లి అక్కడ ఉన్న కిటికీ నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న నవ్‌ఘర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)