Breaking News

మాట్లాడే పనుంది ఇంటికిరా..

Published on Fri, 06/28/2024 - 05:33

సాక్షి, అమరావతి/నల్లజర్ల: సచివాలయ మహిళా ఉద్యోగిపై తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురం మాజీ ఉప సర్పంచ్, టీడీపీ నేత మైనం చంద్రశేఖర్‌ బెదిరింపులకు దిగారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ మహిళా ఉద్యోగిని తన ఇంటికి రావాలని చంద్రశేఖర్‌ ఆదేశించాడు. రాకపోతే ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. మాట్లాడే పని ఉంది ఇంటికి రమ్మనగా.. ఆ ఉద్యోగి ఏదైనా మాట్లాడాలంటే సచివాలయానికి వచ్చి మాట్లాడాలని మర్యాద పూర్వకంగా జవాబిచ్చింది. 

‘నాకు సచివాలయానికి వచ్చే పనిలేదు. నువ్వే మా ఇంటికి రావాలి’ అని చంద్రశేఖర్‌ అనగా.. ‘ఇంటికి ఎలా వస్తామండి’ అని ఆ ఉద్యోగిని సమాధానమిచ్చింది. ‘ఫర్వాలేదమ్మా మీరు గ్రామస్థాయి ఉద్యోగులే కదా.. ఫర్వాలేదు. మీరేం మండల స్థాయి అధికారులు కాదు కదా. మా దగ్గరకురావడానికి నామోïÙగా ఉందా? మాట్లాడే పని ఉందమ్మా’ అని అతడు అన్నాడు. ఏదైనా ఉంటే సచివాలయానికి వచ్చి మాట్లాడాలని ఆమె సూచించగా.. ‘సచివాలయానికి రావాల్సిన పని నాకు లేదు. 

టీడీపీ నెగ్గిన వెంటనే ఒకసారి చెప్పాను. మా ఊళ్లో ఉద్యోగం చేయాలంటే మా ఇంటికి రావాల్సిందే. నీ ఫోన్‌లో ఈ విషయాలన్నీ రికార్డింగ్‌ అవుతాయా? రికార్డు చేసి నువ్వు మీపై అధికారులకు కూడా చెప్పు. మీరేం ఊరికి మొగాళ్లేం కాదు. ఈ ఆడియో ఈ గ్రామంలోని వైఎస్సార్‌ సీపీ మెయిన్‌ నాయకులకు, అధికారులకు పంపు’ అంటూ చంద్రశేఖర్‌ బెదిరింపులకు దిగాడు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)