Breaking News

బీటెక్‌ రవి దాష్టీకం

Published on Mon, 09/23/2024 - 05:24

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: వైఎస్సార్‌ జిల్లా పులివెందుల పట్టణంలోని మారుతీ హలు సమీపంలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి శ్రావణి దంపతులపై టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి దాష్టీకాన్ని ప్రదర్శించారు. ఫోన్‌ కాల్‌ లిఫ్ట్‌ చేయలేదనే కారణంతో ఏకంగా తెలుగు తమ్ముళ్లను ఇంటికి పంపి మరీ కొట్టుకుంటూ తీసుకెళ్లిన ఘటన ఆదివారం జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలు.. పులివెందుల పట్టణం మారుతీ హాల్‌ సమీ­పంలో రాజగోపాల్‌రెడ్డి దంపతులు దుస్తుల షాపు నడుపుతున్నారు. పట్టణంలోని ప్రయి­వేట్‌ ఆస్పత్రిలో  పనిచేస్తున్న వైద్యుడు మధు భార్య లావణ్య దుస్తుల షాపునకు వస్తూ వీరికి పరిచయమైంది. 

హైదరా­బాద్‌లో బ్యూటీషియన్‌ కోర్సు చేస్తున్నానని కొంత, రియల్‌ ఎస్టేట్‌ కోసమని మరికొంత డబ్బును తీసుకుంది. ఏడాదిలో సుమారు రూ.32 లక్షలు తీసుకుంది. తర్వాత లావణ్యను డబ్బులు అడగడంతో నాలుగు నెలల కిందట రూ.10 లక్షల బ్యాంకు చెక్కులు ఇచ్చింది. కాగా, చెక్‌ బౌన్స్‌ అయిందని కోర్టులో రాజగోపాల్‌రెడ్డి, శ్రావణిలు కేసు వేశారు. దీంతో ఈ వ్యవహారం టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి చెంతకు చేరింది. 

వారు ఫోన్‌ చేయడంతో రాజ­గోపాల్‌­రెడ్డి లిఫ్ట్‌ చేయలేదని తెలుగు తమ్ముళ్లు వాహనాలు వేసుకుని రాజగోపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి.. మా వాళ్లపైనే కేసు వేస్తావా అంటూ వారిపై దాడి చేశారు. ఆరుగురు టీడీపీ కార్యకర్తలు రాజగోపాల్‌­రెడ్డిని కారులోనే కొట్టుకుంటూ టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న బీటెక్‌ రవి నేతృత్వంలో మరింతగా రెచ్చిపోయారు.

రాజగోపాల్‌రెడ్డి సతీమణి శ్రావణి పోలీసులకు ఫోన్‌ చేసి విషయం చెప్పడంతో పోలీసులు టీడీపీ నేతలకు ఫోన్‌ చేశారు. దీంతోటీడీపీ నేతలు రాజ­గోపాల్‌­రెడ్డిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం లావణ్య తండ్రి సుధాకరరెడ్డి, చిన్నాన్న చంద్రమౌలేశ్వరెడ్డిలతో పాటు మరో నలుగురిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)