Breaking News

జగనన్న లేఅవుట్‌లోని ఇళ్లు ధ్వంసం

Published on Tue, 06/11/2024 - 04:33

దుత్తలూరు: జగనన్న లేఅవుట్లలోని ఇళ్లను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో జగనన్న లేఅవుట్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎస్సీలకు 36 ఇళ్లు మంజూరు చేసింది. వాటిలో 20 ఇళ్లు పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీవాసులు వైఎస్సార్‌సీపీకి ఓటేశారనే అక్కసుతో సోమవారం సాయంత్రం అదే పంచాయతీ రావిళ్లవారిపల్లికి చెందిన పిడికిటి వెంకటేశ్వర్లు జేసీబీతో ధ్వంసం చేశాడు. ఇదేమని ప్రశ్నిaస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించాడని ఎస్సీ కాలనీవాసులు తెలిపారు.

ధ్వంసం చేసిన తొమ్మిది ఇళ్లలో 6 కాంట్రాక్టర్‌ నిర్మించగా 3 ఇళ్లు సొంతంగా నిర్మించుకుంటున్నారు. ఇళ్ల కూల్చివేతను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కావలి డీఎస్పీ వెంకటరమణ, ఉదయగిరి సీఐ గిరిబాబు, ఎస్సై ఉమాశంకర్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తమ ఇళ్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై  కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీవాసులు డిమాండ్‌ చేశారు. పోలీసులు టీడీపీ నాయకుడు పిడికిటి వెంకటేశ్వర్లును, జేసీబీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  జేసీబీని స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు మంగళవారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)