Breaking News

బైక్‌పై ప్రియురాలిని వదిలేసి.. రాత్రి స్నేహితుడితో కలిసేందుకు వెళ్లి

Published on Tue, 07/25/2023 - 10:35

అన్నానగర్‌(చెన్నై): నెల్‌లై జిల్లా దిసైయాన్‌ విలై తాలూకా స్వామిదాస్‌ పట్టణంలో చెప్పులు కుట్టే కార్మికుడు కన్నియప్పన్‌ కుమారుడు ముత్తయ్య (19). సంగనాన్‌ కుళం గ్రామంలో వివాహ ఆహ్వాన పత్రికలు తయారు చేసే ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. అదే కంపెనీలో ఓ యువతి పని చేస్తోంది. వేర్వేరు కులాలకు చెందిన చెందిన ముత్తయ్య, సదరు యువతి ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ముత్తయ్య ఇంటికి ప్రియురాలు వచ్చింది.

అనంతరం 4.30 గంటలకు ముత్తయ్య తన బైకులో యువతిని ఇడమొళిలో వదిలేసి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాత్రి 8 గంటల సమయంలో స్నేహితుడిని కలిసేందుకు వెళుతున్నానని చెప్పి వెళ్లిన ముత్తయ్య చాలా సేపటి వరకు ఇంటికి రాలేదు. సోదరులు అతన్ని వెతకగా ఆ ప్రాంతంలో మృతదేహమై పడివున్నాడు. దిసైయాన్‌విలై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముత్తయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. నెల్‌లై ఎస్పీ శిలంబరసన్‌, వల్లీయూరు డీఎస్పీ యోగేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రేమ వ్యవహారం వల్లే ఈ హత్య చోటు చేసుకుందని భావిస్తున్నారు.

చదవండి  Hyderabad IIT Student Commits Suicide: హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి మిస్సింగ్‌ కేసు విషాదాంతం

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)