అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Published on Tue, 06/04/2024 - 11:03

హైదరాబాద్: తలకు తీవ్ర గాయమై రక్తపు మడుగులో మెడకు చున్నీ బిగించిన స్థితిలో ఓ మహిళ ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. జవహర్‌నగర్‌ ఠాణా పరిధి కౌకూర్‌ మల్లారెడ్డి కాలనీలో ఉంటున్న కృష్ణ, సుశీల దంపతుల కుమార్తె మాధవి(34) వివాహం బేగంపేట ప్రకాశ్‌నగర్‌కు చెందిన రాజుతో 2007లో జరిగింది. వారికి కుమారుడు పవన్‌(15), కుమార్తె శ్రీజ(13), కుమారుడు మున్నా(11) ఉన్నారు. రాజు అనారోగ్యంతో 2021లో మృతి చెందాడు. అనంతరం మాధవి తన ముగ్గురు సంతానాన్ని తల్లి ఇంట్లో ఉంచి చదివిస్తోంది. ఏఎస్‌రావునగర్‌లోని ఓ డెంటల్‌ క్లినిక్‌లో సహాయకురాలిగా పని చేస్తోంది. 

సికింద్రాబాద్‌ అడ్డగుట్టకు చెందిన సాయితో పరిచయం ఏర్పడింది. సాయికి అప్పటికే వివాహమైంది. అయినా ఇద్దరు కలిసి ఉండాలని 8 నెలల క్రితం సఫిల్‌గూడ బలరాంనగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. సోమవారం ఉదయం 6:40కి సాయి.. మాధవి పెద్ద కుమారుడు పవన్‌కు ఫోన్‌ చేసి మీ అమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. మాధవి తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు వెళ్లి చూడగా గదిలో తలకు గాయమై రక్తపు మడుగులో మృతి చెంది ఉంది. సీఐ సందీప్‌కుమార్, ఎస్సై రమేష్‌లు చేరుకుని ఆధారాల్ని సేకరించారు. మృతురాలి దగ్గర 2 చరవాణులు, రూ.20 వేల నగదు, ఒక ద్విచక్ర వాహనం ఉంది. అవి కనిపించలేదు. సాయి వాటిని తీసుకొని పరారయ్యాడని భావిస్తున్నారు. సాయి నడిపే ఆటో మాధవే కొన్నదని బంధువులు తెలిపారు. అతడు చిక్కితే అన్ని విషయాలు బయటకొస్తాయని పోలీసులంటున్నారు.

ఆదివారం రాత్రి తల్లి తనకు ఫోన్‌ చేసిందని పెద్ద కుమారుడు పవన్‌ పోలీసులకు చెప్పాడు. తన వద్ద రూ.20వేలు ఉన్నాయని.. వాటితోపాటు తన ఫోన్‌ నుంచి మరో 8వేలు బదిలీ చేసుకోవాలని చెప్పిందని పోలీసులకు వివరించాడు. తనకు ప్రాణభయం ఉందని మాధవికి ముందుగానే తెలుసా? లేక ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో కొడుక్కి డబ్బులు అందజేయాలని అనుకొని ఫోన్‌ చేసిందా? ఆత్మహత్య అయితే మెడకు చున్నీతో ఉరి వేసుకొని ఉండాలి.. అలా కాకుండా రక్తపు మడుగులో కింద పడి ఉండడాన్ని గమనిస్తే.. హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చి ఎందుకు పారిపోయాడనే కోణంలోనూ దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)