ఏమైంది శ్రీకృష్ణ... ముగ్గురు అన్నదమ్ములకు ఒక్కడే వారసుడు 

Published on Wed, 06/28/2023 - 11:32

కాకినాడ: వైద్య కళాశాల క్యాంపస్‌లో ఓ మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. పోలీసులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొండూరు శ్రీకృష్ణ కేదార్‌ (27) అలియాస్‌ శృంగేరి జీఎస్‌ఎల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, పీజీ (పీడియాట్రిక్స్‌) సెకండియర్‌ చదువుతున్నాడు. కళాశాల ప్రాంగణంలోని స్టాఫ్‌ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. 

ఏం జరిగిందో ఏమో కానీ మంగళవారం ఉదయం 6.55 గంటల సమయంలో స్టాఫ్‌ క్వార్టర్స్‌ సమీపంలోని కారిడార్‌ వద్ద అతడు విగతజీవిగా పడి ఉన్నాడు. అతడిని గమనించిన వారు వెంటనే సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టీవీఎస్‌పీ మూర్తికి సమాచారం అందించారు. ఆయన వెంటనే అక్కడకు చేరుకున్నారు. కేదార్‌ను పరీక్షించగా అప్పటికే అతను మరణించినట్టు గుర్తించారు. దీంతో అక్కడి నుంచే అతడి తల్లిదండ్రులకు, స్థానిక పోలీసులకు  డాక్టర్‌ మూర్తి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. రాజమహేంద్రవరం తూర్పు మండలం డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు, స్థానిక సీఐ కాశీ విశ్వనాథ్‌ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అంతలోనే మృతుని తల్లిదండ్రులు కూడా అక్కడకు చేరుకున్నారు. 

కవుకు దెబ్బలు 
మృతుని చెవుల నుంచి రక్తం కారడం, శరీరంపై నెత్తుటి గాయాలు, కవుకు దెబ్బలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంతటి పిరికివాడు కాదని, ఇది ఏమాత్రం ఆత్మహత్య కాదని తండ్రి శివరామలింగేశ్వరరావు అన్నారు. కేదార్‌ మృతిపై తమకు అనుమానం ఉందని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, న్యాయం చేయాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మెడికో మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. క్లూస్‌ టీమ్‌ను, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించారు. మృతుని ఫోన్‌ డేటా పరిశీలించగా.. సోమవారం రాత్రి నుంచి తెల్లవారుజామున 6.42 గంటల వరకూ తల్లిదండ్రులతో తరచూ మాట్లాడుతున్నట్టు ఉందని డీఎస్పీ చెప్పారు. అన్ని కోణాల్లోనూ ఈ కేసు దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. 

ముగ్గురు అన్నదమ్ములకు ఒక్కడే వారసుడు 
మృతుడు కేదార్‌ తండ్రి శివరామలింగేశ్వరరావుకు ఇద్దరు సోదరులున్నారు. ఈ ముగ్గురికీ కేదార్‌ ఒక్కడే వారసుడు. ‘ముగ్గురు అన్నదమ్ములైన మాకు ఒక్కడే వారసుడు కావడంతో అందరం అల్లారుముద్దుగా పెంచుకున్నాం. మెడిసిన్‌ చేస్తానంటే చదివించాం. ఎంబీబీఎస్‌ తరువాత పీజీ చేస్తానంటే ఒకే అన్నాం. ఇలా వాడు అడిగింది ఏదీ కాదనకుండా వచ్చిన మాకు ఇలా కడుపు శోకం మిగులుస్తాడనుకోలేదు’ అంటూ కేదార్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)