క్రిష్‌ విచారణ ఎప్పుడు? 

Published on Thu, 02/29/2024 - 05:03

గచ్చిబౌలి: రాడిసన్‌ బ్లూ హోటల్‌ డ్రగ్‌ కేసులో అనుమానితునిగా ఉన్న తెలుగు సినీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ విచారణ ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. క్రిష్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌లో ఉందని, ముంబైలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ క్రిష్‌ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అనుమానితునిగా ఉన్న క్రిష్‌ పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు జాప్యానికి గల కారణాలను అధికారులు వెల్లడించడం లేదు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న రఘు చరణ్, సందీప్, లిషీ, శ్వేత, నీల్‌ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

రాడిసన్‌ హోటల్‌లో గత శనివారం డ్రగ్‌ పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద పార్టీ ముగి సే వరకు హోటల్‌ గదిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రఘు చరణ్, నీల్‌తో కలిసి వచ్చిన డైరెక్టర్‌ క్రిష్‌ నేరుగా వివేకానంద ఉన్న గదిలోకి వెళ్లి 30 నిమిషాల పాటు గడిపినట్లు పోలీసు లు గుర్తించారు. కేదార్, లిషీ, నిర్బయ్‌ కలిసి రాడిసన్‌ హోటల్‌కు వెళ్లారు. సందీప్, శ్వేత రాడిసన్‌కు వచ్చారు. రాత్రి 8.30 గంటలకు పార్టీ ముగించుకొని వెళ్లగా పోలీసులు రాత్రి 12.30 గంటలకు హోటల్‌ కు చేరుకున్నారు. అప్పటికే డ్రగ్‌ పార్టీ ముగించుకొని అక్కడి నుంచి అందరూ ఉడాయించారు.  

సీసీ కెమెరాలపై అనుమానాలెన్నో 
స్టార్‌ హోటల్‌గా గుర్తింపు ఉన్న రాడిసన్‌ హోటల్‌లో సీసీ కెమెరాల నిర్వహణ ఆధ్వానంగా ఉండటం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. హోటల్‌లో మొత్తం 209 కెమెరాలు ఉండగా కేవలం 16 సీసీ కెమెరాలు మాత్రమే పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. డ్రగ్‌ పార్టీ జరిగిన రూమ్‌ వైపు ఉన్న కెమెరాలు పని చేయకపోవడం గమనార్హం. కావాలనే సీసీ కెమెరాలు పని చేయకుండా చేశారా అనే అనుమానాలు నెలకొన్నాయి.    

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)