Breaking News

హైదరాబాద్‌- విజయవాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

Published on Thu, 04/04/2024 - 19:26

సాక్షి, సూర్యాపేట:  సూర్యాపేట జిల్లా కేంద్రంలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌- విజయవాడ 65వ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టింది.  అదే సమయంలో వెనక నుంచి వచ్చిన ఎర్టీగా కారు ఆటోను ఢీకొట్టింది. ఆటో సూర్యాపేట నుంచి అర్వపల్లి వెళ్తుండగా అంజనాపురి కాలనీ క్రాసింగ్‌లో ఈ దుర్ఘటన జరిగింది.

ఈ ప్ర‌మాదంలో నలుగురు ప్ర‌యాణికులు మృతి చెంద‌గా, మ‌రో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది.  రెండు వాహనాల మధ్య ఆటో చిక్కుకోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న వారిలో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)