Breaking News

కవిత స్పందన బ్లేమ్‌గేమ్‌లా ఉంది

Published on Fri, 04/14/2023 - 03:28

సాక్షి, న్యూఢిల్లీ:  తన క్లయింట్‌ సుకేశ్‌ చంద్రశేఖర్‌ లేవనెత్తిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించిన తీరు మీడియా, రాజకీయ పార్టీలపై బ్లేమ్‌ గేమ్‌ (పరిష్కారం కోసం చూడకుండా నిందలు వేయడం)లా ఉందని న్యాయవాది అనంత్‌ మాలిక్‌ విమర్శించారు. సుకేశ్‌ ఎవరో తనకు తెలియదంటూ కవిత విడుదల చేసిన ప్రకటనపై స్పందించారు. ఈ మేర కు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ‘సుకేశ్‌ చంద్రశేఖర్‌ లేవనెత్తిన అంశాలపై కవిత జారీ చేసిన ప్రకటన చిన్నపిల్లల వ్యవహారంలా ఉంది.

సుకేశ్‌ తన ఆరోపణలను అఫిడవిట్‌ రూపంలో ఇచ్చారు. ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ సెక్షన్‌ 65బీ కింద ధ్రువపత్రం కూడా ఇచ్చారు. ఈ విషయంలో న్యాయమైన విచారణను స్వాగతించకుండా అస్పష్టమైన ఆరోపణలతో దర్యాప్తు నుంచి తప్పించుకోవాలని యత్నించడం నీటిని ఒడిసి పట్టుకొని ఉంచాలనుకోవడమే. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడెవరైనా విచారణ స్వాగతించేవారు.

కవిత స్పందన చూస్తుంటే దాగుడుమూతలు ఆడడంలో ఉన్న నైపుణ్యం కనిపిస్తోంది. ఈ అంశం ప్రత్యేక దర్యాప్తు సంస్థల ప్రత్యేక పరిశోధనకు సంబంధించినదే కానీ, ప్రజల్లో ప్రజాదరణ కోసం పోటీ కాదు. అయితే నా క్లయింట్‌ కూడా ఈ వారంలోనే పూర్తిస్థాయిలో స్పందిస్తారు’ అని అనంత్‌ తెలిపారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)