Breaking News

రాజకీయ కక్షతోనే ఈ దారుణం

Published on Mon, 08/05/2024 - 04:34

సాక్షి ప్రతినిధి కర్నూలు: మహానంది మండలం సీతారామాపురంలో హత్య­కు గురైన సుబ్బరాయు­డిది వివాద రహిత కుటుంబం. ఎవ్వరి జోలికి వెళ్లరు. దివంగత నేత వైఎస్‌ రాజ­శేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటే అభిమానం. సీతారామాపురంలో టీడీపీకి తప్ప మరో పార్టీ తరఫున ఏజెంట్లు కూర్చో­లేని పరిస్థితి. ఎన్నిక ఏదైనా టీడీపీ నేతలు రిగ్గింగ్, సైక్లింగ్‌ చేసు­కునే వారు. టీడీపీ నేత బుడ్డారెడ్డి గారి శ్రీనివాస­రెడ్డి గ్రామంలో ఏకఛత్రాధిపత్యం చెలాయించేవాడు. వేరే వర్గం అంటూ లేకుండా తన గూండాయిజంతో బెదిరింపులకు పాల్పడేవాడు. 

గతంలో గ్రామంలో ఓట్లు వేయాలంటేనే భయపడే పరిస్థితి. స్వతంత్రంగా ఓటేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన దుస్థితి. శ్రీనివాసరెడ్డి ఎవరికి చెబితే వాళ్లకే ఓటేయాలి. లేదంటే ఊరు వదిలేసి వెళ్లేలా బెదిరింపులకు పాల్పడేవాడు. గ్రామ పంచాయతీలో 210, 211 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో 1,488 ఓట్లున్నాయి. వీటిలో 1,305 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 733, వైఎస్సార్‌ సీపీకి 572 ఓట్లు వచ్చాయి. వీటిలో ఒక పోలింగ్‌ బూత్‌లో మృతుడు సుబ్బరాయుడు కుమారుల్లో ఒకరైన నాగప్రసాద్‌ ఏజెంట్‌గా కూర్చున్నాడు. 

దీంతో వైఎస్సార్‌సీపీకి అన్ని ఓట్లు రావడాన్ని జీర్ణించుకో­లేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ఫలితాలు వెలువడి­నప్పటి నుంచి గ్రామంలో బెదిరింపుల పర్వం ప్రారంభించాడు. తనకు వ్యతిరేకంగా ఉన్నా, వైఎస్సార్‌సీపీ కోసం పనిచేసినా చంపేస్తానని బెదిరించేవాడు. రెండు నెలల వ్యవధిలోనే మూడు సార్లు వైఎస్సార్‌ సీపీ నేత నారపురెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. ఇతనిపై నంద్యాల, ఆళ్లగడ్డ, మహా­నంది మండలాల పరిధిలో 57 కేసులు నమోద­య్యాయంటే ఎంతటి కరుడుగట్టిన నేరస్తుడో అర్థమవుతోంది. ఇప్పటికీ కొన్ని కేసులపై కోర్టుకు హాజరవుతున్నాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)