Breaking News

బీసీ వసతిగృహంలో విద్యార్థి మృతి

Published on Mon, 11/04/2024 - 05:38

విజయనగరం అర్బన్‌/సాక్షి, అమరావతి: జిల్లా కేంద్రం విజయనగరంలోని కాటవీధిలోగల బీసీ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఆదివారం మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేట రాజాం గ్రామానికి చెందిన కొణతాల శ్యామలరావు (12) ఏడో తరగతి చదువుతున్నాడు. శ్యామలరావు ఆదివారం ఉదయం అల్పాహారం తిన్న తరువాత మంచినీళ్లు తాగి దుస్తులు ఉతుక్కునేందుకు వెళ్తూ కళ్లు తిరిగి స్పృహతప్పి పడిపోయినట్టు వార్టెన్‌ జానకిరావు తెలిపారు. 

అతడిని వెంటనే నగరంలోని సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే విద్యార్థి మృతిచెందాడని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అప్పలనాయుడు తెలిపారు. సమీపంలో ఉన్న ఆస్పత్రిని కాదని దూరంగా ఉన్న పెద్దాస్పత్రికి తీసుకువెళ్లడం వల్లే తమ మేనల్లుడి ప్రాణాలు పోయాయని శ్యామలరావు మేనమామ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ శ్యామలరావు మృతికి కార­ణం ఏమిటనేది తెలియదని బీసీ సంక్షేమశాఖ ఇన్‌చార్జి ఈడీ పెంటోజీరావు చెప్పారు. హాస్టల్‌లో ఇటీవల నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో శ్యామలరావుకు ఎటువంటి అనారోగ్యం లేదని తేలిందన్నారు. ప్రస్తుతం హాస్టల్‌లో విద్యార్థులెవరికీ అనారోగ్య సమస్యలు లేవని ఆయన తెలిపారు.  

నివేదిక ఇవ్వండి: మంత్రి సవిత ఆదేశం  
విజయనగరంలోని బీసీ హాస్టల్‌ విద్యార్థి కొణతాల శ్యామలరావు మృతికి కారణాలపై తక్షణమే తనకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌.సవిత అధికారులను ఆదేశించారు. విద్యార్థి మృతిపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఆ విద్యార్థి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వాస్తవాలను విచారించి నివేదించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)