Breaking News

‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఇక నుంచి ఇలాంటివే జరుగుతాయి’

Published on Wed, 07/12/2023 - 07:57

బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా బుట్టాయగూ­డెం మండలం పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. హాస్టల్‌లో నిద్రపోతున్న నాలుగో తరగతి వి­ద్యా­ర్థి గోగుల అఖిల్‌వర్ధన్‌రెడ్డి (9) దారుణహత్యకు గురయ్యాడు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అటవీ ప్రాంతంలో గల శివారు గ్రామం ఒర్రింకకు చెందిన గోగుల శ్రీనివాసరెడ్డికి ఇద్దరు భార్యలు. వారిద్దరు అక్కచెల్లెళ్లు. మొదటి భార్య లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, రెండో భార్య రామలక్ష్మికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రామలక్ష్మి రెండో కుమారుడైన అఖిల్‌వర్ధన్‌రెడ్డి గత ఏడాది ఈ ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతిలో చేరా­డు.

ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నా­డు. సోమవారం రాత్రి 10 గంటలకు తోటి వి­ద్యా­ర్థులతో కలిసి వసతిగృహంలో నిద్రపోయా­డు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వసతిగృహం పక్కవైపు కిటికీలో నుంచి లోపలికి ప్రవేశించి టార్చ్‌లైట్‌తో అఖిల్‌వర్ధన్‌రెడ్డిని గుర్తించి మరీ బయటకు తీసుకువెళ్లారు. దుండగులు తీసుకెళ్లిన అఖిల్‌వర్ధన్‌రెడ్డి తెల్లవారేసరికి పాఠశాల ఆవరణ సమీపంలో శవమై కనిపించాడు.

మృతుడి చేతిలో ఒక లెటర్‌ ఉంది. దాన్లో ‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఎందుకంటే ఇకనుంచి ఇలాంటి సంఘటనలే జరుగుతాయి..’ అని రాసి ఉంది. అఖిల్‌వర్ధన్‌రెడ్డి మెడ నల్లగా కమిలిపోయి ఉంది. కాలితో తొక్కి చంపి ఉండవ­చ్చ­ని భావిస్తున్నారు. మర్మాంగాలు చితికిపోయి ఉన్నాయని, వీపుపై గాయాలున్నా­యని వైద్యులు తెలిపారు. 

అన్ని కోణాల్లో దర్యాప్తు  
ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మేరీ ప్రశాంతి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు తెలి­పారు. ఏలూరు నుంచి తీసుకొచ్చిన పోలీస్‌ జాగి­లం సహాయంతో గాలించారు.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)