Breaking News

ముచ్చుమర్రి కేసు ఇంకా విచారణ జరుగుతోంది: ఎస్పీ

Published on Tue, 07/16/2024 - 16:21

నంద్యాల, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన నంద్యాల ముచ్చుమర్రి మైనర్‌ బాలిక కేసులో తాజా పురోగతిని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం మీడియాకు వివరించారు. అయితే కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, బాలిక మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని వాళ్లు తెలిపారు.

నందికొట్కూరు సమీపంలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఈ నెల 7వ తేదీన బాలిక మిస్సింగ్‌ కేసు నమోదు చేశాం. విచారణలో ముగ్గురు పిల్లలు బాలికకు చాక్లెట్‌ ఆశ చూపించి అత్యాచారం చేశారు. ఆపై గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత కేసీ కెనాల్ తీసుకుని వచ్చి తమ ఇంట్లోవాళ్లకు విషయం చెప్పారు. 

ఆపై తమ తండ్రుల సాయంతో సంచిలో ఉన్న బాడీని వనములపాడు గ్రామానికి బైక్‌పై తీసుకెళ్లి.. బాలిక డెడ్‌బాడీ ఉన్న సంచిలో బండరాళ్లు వేసి కృష్ణా నదిలో పడేశారు. విచారణలో ఆ పిల్లల తల్లిదండ్రులు మోహన్,సద్గురులు నేరం ఒప్పుకున్నారు. గ్యాంగ్‌ రేప్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. కేసులో ఐదుగురిని అదుపులో తీసుకున్నాం. నిందితుల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశాం. విచారణ ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అని అన్నారాయన. 

మరోవైపు.. ఘటన జరిగి పదిరోజులైనా బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోవడం, మైనర్‌ నిందితుల నుంచి పోలీసులు సరైన సమాచారం రాబట్టలేకపోతుండడం.. విమర్శలకు దారి తీస్తోంది. ఇంకోవైపు ఈ కేసులో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వంపైనా ముచ్చుమర్రి గ్రామస్తులు మండిపడుతున్నారు. 

వాళ్లను అలా వదిలేయొద్దు
‘‘పది రోజులైనా మా పాప ఏమైందో చెప్పలేకపోతున్నారు. మా పాపను అత్యాచారం చేసి చంపేశామని ముగ్గురు చెబుతున్నా పోలీసులు వారిని ఏమీచేయలేకపోతున్నారు. వాళ్లను కాల్చేస్తేనే మా పాప ఆత్మకు శాంతి కలుగుతుంది. మరో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదంటే వాళ్లను చంపేయాలి’’

:::బాలిక తల్లిదండ్రులు

ఇదీ చదవండి: గిరిజన బాలిక ఎక్కడ బాబూ?

Videos

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)