Breaking News

నేతన్న విషాదాంతం!

Published on Thu, 04/25/2024 - 17:09

సిరిసిల్లటౌన్‌: కొందరి దీన పరిస్థితి చూస్తే.. పగవారికి కూడా అటువంటి కష్టాలు రాకూడదని అనిపిస్తుంది. ఇదే తరహాలో సిరిసిల్ల నేత కార్మికుడి విషయంలో జరిగిన ఘటన మానవతావాదులను కలచివేసింది. పోలీసుల కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణం నెహ్రూనగర్‌కు చెందిన ఈగ రాజు (45) రోకడ (ఎక్కడ పని ఉంటే అక్కడ సాంచాలు నడిపే పని) నేత కార్మికుడు. అయితే చాలా రోజులుగా సిరిసిల్లలో పనుల్లేక ఖాళీగా ఉంటున్నాడు.

నాలుగు రోజుల క్రితం పనిని వెతుక్కుంటూ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఎటు వెళ్లాడో తెలియని స్థితిలో కుటుంబ సభ్యులు దిక్కుతోచకుండా ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం కరీంనగర్‌ జిల్లా వెదిర గ్రామం నుంచి ఫోన్‌ వచ్చింది. తమ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి వడదెబ్బతో చనిపోయాడని, ఆధార్‌కార్డులో సిరిసిల్ల వాసిగా అడ్రస్‌ ఉందని తెలిపారు.

వెంటనే భార్య రేఖతో పాటు బంధువులు వెదిరకు వెళ్లారు. రాజు వేసుకున్న దుస్తుల ఆనవాళ్లను బట్టి అతనే అనిపించినా.. ఎండకు, ఆకలికి తాళలేక బక్కచిక్కి.. మొఖం రంగు మారిన క్రమంలో భార్య రేఖ తన భర్తను గుర్తు పట్టలేక పోయింది. చనిపోయింది తన భర్తకాదని, పని దొరికాక ఇంటికి వస్తాడన్న నమ్మకంతో సిరిసిల్లకు తిరిగి వచ్చింది.  

ఎస్సై సురేందర్‌ విచారణతో.. 
వెదిర గ్రామ కార్యదర్శి గౌరి రమేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామడుగు ఎస్సై సురేందర్‌.. ఈగ రాజు మృతి కేసును దర్యాప్తు చేశారు. బుధవారం సిరిసిల్లలో రాజు ఇంటికి వచ్చి నేరుగా విచారణ చేపట్టారు. ఇంట్లో ఉన్న ఫొటోలు, మృతుడిపై ఉన్న దుస్తులను బట్టి ఆ శవం ఈగ రాజుదిగా నిర్ధారించారు. కరీంనగర్‌లో పోస్టుమార్టం జరిపించి బుధవారం రాత్రి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్సై సురేందర్‌ తెలిపారు. 

ఆర్థిక ఇబ్బందులే కారణమా? 
ఈగ రాజు మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు తెలిపారు. కొంత కాలంగా రాజుకు పని లేకుండా ఖాళీగా ఉంటున్నాడని, కుటుంబ భారం మొత్తం భార్య రేఖ మోస్తోందని చెప్పారు. కొద్ది నెలల క్రితమే కూతురుకు వివాహం జరిగిందని, రాజుకు అనారోగ్యం.. తదితర కారణాలతో కుటుంబానికి అప్పులయ్యాయని తెలిపారు. ఈ క్రమంలోనే రాజు పని వెతుక్కుంటూ ఇంట్లోంచి వెళ్లిపోయాడని, చేతిలో డబ్బులేక మండుటెండల్లో సరైన ఆహారం లభించక, ఎండల ధాటికి మృతిచెందినట్లు స్థానికులు భావిస్తున్నారు.  

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)