Breaking News

ప్రియుడి మోజులో.. భర్తనే కడతేర్చింది..

Published on Sun, 08/11/2024 - 05:39

ఒంగోలు టౌన్‌: ప్రియుడి మోజులో పడి ఆమె ఏకంగా భర్తనే హతమార్చింది. తన వ్యవహారం బయట పడేసరికి భర్త మందలించడం.. భర్త బతికుంటే తమ ‘బంధం’ కష్ట మని భావించిన ఆ మహిళ.. కిరాయి ముఠా, ప్రియుడి సాయంతో కట్టుకున్న భర్తనే దారుణంగా కడతేర్చింది.. ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ చల్లా వెంకటనరేంద్రబాబు హత్య కేసు­లో మృతుడి భార్యతో సహా మరో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ శనివారం  మీడియాకు వెల్లడించారు.   

ఆ యువకుడికి అలా దగ్గరైంది..  
ఒంగోలులోని పీఎఫ్‌ ఆఫీసులో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే చల్లా వెంకటనరేంద్రబాబు పొదిలిలోని పీఎన్‌ఆర్‌ కాలనీ మూడో లైనులో నివాసముంటున్నాడు. ఆయనకు భార్య లక్ష్మీప్రియ, ఇద్దరు పిల్లలు. వారి ఇంటి ఎదురుగా అద్దె ఇంట్లో ఉంటున్న కొండ శశికుమార్‌ అనే యువకుడికి లక్ష్మీప్రియ దగ్గరైంది. వారి వ్యవహారం తెలిసిన నరేంద్ర.. ఇద్దరినీ తీవ్రంగా మందలిస్తూ వస్తున్నాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు శశితో కలిసి పథకం రచించింది. ఆమె ఇంట్లో ఉన్న బంగారు నగలను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో నెల్లూరుకు చెందిన కిరాయి హంతకులతో రూ.2 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. 

ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున నరేంద్ర గాఢ నిద్రలో ఉన్న సమయంలో శశితో పాటు.. నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన నలుగురు యువకులు కలిసి నరేంద్ర గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. మృతదేహాన్ని వంటగదిలోకి తీసు­కెళ్లి తాడుతో వేలాడ దీశారు. భార్యభర్తల గొడవలతో విసిగివేసారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు యత్నించారు. 

ఇదిలా ఉండగా, కిరాయి ముఠా తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తొలుత రూ.50 వేలు మాత్రమే అడ్వాన్స్‌గా చెల్లించారు. మిగిలిన డబ్బు కోసం వారు ఫోన్లు చేస్తుండటంతో భయపడిపోయిన శశిపోలీసులకు లొంగిపోయాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితులు.. లక్ష్మీప్రియతో పాటుగా ఆమె ప్రియుడు కొండ శశికుమార్, నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన షేక్‌ నహీద్, షేక్‌ ఫజ్లూ, సయ్యద్‌ సిద్దిక్, షేక్‌ ముబారక్‌లను అరెస్టు చేసినట్టు ఎస్పీ దామోదర్‌ వివరించారు.   

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)